సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 24, 2021 , 00:31:56

కలెక్టరేట్‌లోనే గణతంత్ర వేడుకలు

కలెక్టరేట్‌లోనే గణతంత్ర వేడుకలు

  • కొవిడ్‌ దృష్ట్యా శకటాలు, స్టాల్స్‌ లేవు
  • ప్లాస్టిక్‌ త్రివర్ణపతాకాలు వినియోగించొద్దు 
  • కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి కలెక్టరేట్‌, జనవరి 23: గణతంత్ర దినోత్సవ వేడుకలను కలెక్టర్‌ కార్యాలయ ఆవర ణలోనే ఘనంగా నిర్వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను కొవిడ్‌ నిబంధనలు, మార్గ దర్శకాలను విధిగా పాటిస్తూ నిర్వహించాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ శనివారం కలెక్టరేట్‌ ఆవరణలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యా నాయక్‌ల తో కలిసి చర్చించారు. 26వ తేది ఉదయం 9 గం టలకు కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. కొవిడ్‌ మార్గదర్శకాల దృ ష్ట్యా ప్రభుత్వం అభివృద్ది పథకాలపై శకటాలు, స్టాల్స్‌ ఏర్పాట్లు నిలిపివేశారు. దేశపౌరులెవ్వరూ ప్లాస్టిక్‌ త్రివర్ణ పతకాలను వినియోగించరాదని ప్ర భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్‌ త్రివర్ణ ప తాకాలు వినియోగించినట్లయితే ఫ్లాగ్‌ కోడ్‌ నిబం ధనల ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయని ప్ర భుత్వం హెచ్చరించింది. గణతంత్ర దినోత్సవ వే డుకల్లో విధిగా మాస్కులు, భౌతిక దూరం పాటిం చడంతో పాటు వ్యక్తిగత శానిటైజేషన్‌ చర్యలు తీ సుకోవాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.

రేపు జాతీయ ఓటర్ల దినోత్సవం

ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కలెక్ట ర్‌ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉద యం 10.30 గంటలకు కొవిడ్‌ నిబంధనలు పాటి స్తూ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేస్తారు. అధికారు లందరూ 25వ తేదీన ఉదయం 10.30 గంటల కు జాతీయ ఓటర్ల దినోత్సవంలో పాల్గొనాలని క లెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నూతన ఓటర్లకు ఓటరు కార్డు జారీ చేస్తారు. ఈ కార్యక్ర మంలో ఏవో నాగేశ్వర చారి పాల్గొన్నారు. 


VIDEOS

logo