బడి పిలుస్తోంది..!

- ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్
- కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు
- హాజరు కానున్న 9, 10, ఆపై తరగతుల విద్యార్థులు
- విద్యాశాఖ సూచనలు, మార్గదర్శకాలు విడుదల
- ఇప్పటికే పుస్తకాలు, యూనిఫామ్‌ల అందజేత
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- సుందరంగా ముస్తాబైన విద్యాలయాలు
ఆలేరు టౌన్/అడ్డగూడూరు/సంస్థాన్ నారాయణ పురం, జనవరి 21 : కరోనాతో గత ఏడాది మార్చి నుంచి పాఠశాలలు మూసివేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, టీకా పంపిణీ కార్యక్రమం చకచకా కొనసాగుతుండటంతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 9, 10వ తరగతులే ప్రారంభించనుండటంతో విద్యార్థుల సంఖ్య తగ్గనున్నది. గత ఏడాది మార్చి 16వ తేదీ నుంచి నిలిచిపోయిన బోధన ఇప్పటికీ ప్రారంభం కాలేదు. సాధారణ విద్యా సంవత్సరం ముగిసే దశకు రావడంతో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అలాగే పాఠశాలల్లో మిగిలిపోయిన మధ్యాహ్న భోజన బియ్యం నిల్వలపై ఆరా తీస్తున్నారు. చాలా చోట్ల బియ్యం నెలల తరబడి ఉండటంతో ముక్కిపోయాయి. దీంతోపాటు బడి తెరిచిన మొదటి రోజు నుంచే 9, 10వ తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నారు. పరిశుభ్రత పాటించి వంట చేయాలని, కూరగాయలను ఒకటికి రెండుసార్లు కడగాలని సూచిస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ రూపొందించిన నిబంధనల మేరకు తరగతి గదిలో ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య కనీస దూరం ఆరు అడుగుల మధ్య ఉండాలి. మధ్యాహ్న భోజనానికి క్యూ కట్టే విద్యార్థులు కనీసం 6 అడుగుల దూరం పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. ప్రతీ స్కూల్లో తగినన్ని శానిటైజర్లు ఉండాలి. కనీసం రెండు ఐసొలేషన్ గదులను ఏర్పాటు చేయాలి. పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. జలుబు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కాకుండా చూడాలి.
ప్రణాళిక ప్రకారం బోధన...
గతంలో మొత్తం 365 రోజులకు 220 రోజులు పాఠశాలలు పని చేసేవి. విద్యార్థుల సిలబస్ కూడా పూర్తయ్యేది. ఇప్పుడు అంత సమయం లేదు. కరోనాతో పాఠశాలలు మూతపడటంతో విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో గత 4 నెలలుగా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం వారి ఇండ్లకు వెళ్లి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ప్రస్తుతం 100 రోజులు పాఠశాలలు నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో తక్కువ సమయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందుకు అనుగుణంగా బోధన జరిగితేనే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతీ విద్యార్థిపై ఉపాధ్యాయుడు శ్రద్ధ పెట్టాలి. తరగతుల నిర్వహణ పడక్బందీగా నిర్వహించాలి. కొవిడ్ నిబంధనలు పాటించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో విద్యార్థులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలి.
తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి..
కరోనా నేపథ్యంలో 9, 10వ తరగతి విద్యార్థులు బడులకు రానున్నారు. అయితే తల్లిదండ్రులు ఆమోదిస్తేనే పిల్లలను బడుల్లోకి అనుమతిస్తారు. తల్లిదండ్రుల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుంటారు. ఒకవేళ బడికి రాని పిల్లలకు ఆన్లైన్లో బోధన జరుపుతారు. గదికి 20 మందిని మాత్రమే అనుమతించనున్నారు. చాలా నెలల తరువాత బడులు ప్రారంభం కానుండటంతో పాఠశాలల గదులను శుభ్రం చేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో..
యాదాద్రి జిల్లాలో 9వ తరగతిలో 7126 విద్యార్థులు, 10వ తరగతిలో 7509 మంది విద్యార్థులు ఉండగా, జిల్లా పరిషత్ పాఠశాలలు 163 ఉన్నాయి.
కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా....
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు దాతల సహకరంతో అందమైన రంగులు, చిన్నారులకు అర్థమయ్యే లా బొమ్మలు వేయడంతోపాటు ప్రహరీ గోడలు, నూతన టాయిలెట్ల నిర్మాణం, ఆట స్థలాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారయ్యాయి. ప్రభుత్వ విద్యాలయాలు తల్లిదండ్రులను, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజావార్తలు
- కోవిడ్ టీకా తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- మూతపడిన కరాచీ బేకరీ
- శ్రీవారిని దర్శించుకున్న అల్లరి నరేష్
- ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ గొంతుకనవుతా: వాణీదేవి
- డీఎంకేతో పొసగని కాంగ్రెస్ పొత్తు.. కూటమిలో కొనసాగేనా?
- లంచ్ టైమ్.. ఇంగ్లండ్ 74/3
- హీరోని చూసేందుకు నీళ్ళల్లోకి దూకిన అభిమాని
- విరాట్ కోహ్లి vs బెన్ స్టోక్స్.. నాలుగో టెస్ట్‌లో గొడవ.. వీడియో
- వావ్ పొలార్డ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. వీడియో
- జార్ఖండ్‌లో ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి