ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 21, 2021 , 00:03:30

నేటి నుంచి జిల్లా పరిషత్‌ స్థాయీసంఘాల సమావేశాలు

నేటి నుంచి జిల్లా పరిషత్‌ స్థాయీసంఘాల సమావేశాలు

  • మూడు రోజులపాటు... ఏడు స్థాయీ సంఘాల నిర్వహణ
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

భువనగిరి, జనవరి 20 : జిల్లా పరిషత్‌కు కీలకమైన స్థాయీ సంఘాల సమావేశాలను ఈనెల 21 నుంచి 23వ తేదీ శనివారం వరకు నిర్వహించేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టారు. మూడు రోజులపాటు నిర్వహించే ఏడు స్థాయీ సంఘాలకు ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జిల్లాస్థాయి అధికారులకు, స్థాయీ సంఘాల చైర్మన్లు, సభ్యులకు సమాచారాన్ని సైతం అందజేశారు. స్థాయీ సంఘాల సమావేశాల్లో భాగంగా ఈ నెల 21న గురువారం ఉదయం 11గంటలకు ఒకటవ స్థాయీ సంఘం(ఆర్థిక), ఏడవ స్థాయీ సంఘం(పనులు). మధ్యాహ్నం 2:30 గంటలకు రెండవ స్థాయీ సంఘం(గ్రామీణాభివృద్ధి) సమావేశాలు. 22న శుక్రవారం ఉదయం 11గంటలకు నాలుగవ స్థాయీ సంఘం(విద్య, వైద్యం), మధ్యాహ్నం 2:30గంటలకు మూడవ స్థాయీ సంఘం(వ్యవసాయం). 23న శనివారం ఉదయం 11 గంటలకు ఐదవ స్థాయీ సంఘం(మహిళా, శిశు, సంక్షేమం), మధ్యాహ్నం 2:30 గంటలకు ఆరవ స్థాయీ సంఘం(సాంఘిక సంక్షేమం) సమావేశాలు నిర్వహించనున్నారు.

మూడు రోజులపాటు ఏడు స్థాయీ సంఘాల నిర్వహణ

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మూడు రోజులపాటు ఏడు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు మొదటిరోజు ఒకటవ, ఏడవ, రెండవ సమావేశాలను, రెండవ రోజు నాలుగవ, మూడవ స్థాయీ సంఘాల సమావేశాలు, మూడవరోజు ఐదవ స్థాయీ సంఘం, ఆరవ స్థాయీ సంఘాల సమావేశాలను చేపట్టనున్నారు. 

స్థాయీ సంఘాల సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి 

జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్న జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాం. సమావేశాలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారాన్ని అందజేశాం. నిర్దేశిత సమయానికి స్థాయీ సంఘాల సమావేశాలను చేపట్టనున్నాం.

- సీహెచ్‌.కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్‌ సీఈవో


VIDEOS

logo