వైభవంగా నిత్య కళ్యాణం

- భక్తిశ్రద్ధలతో పూజలు
- హుండీల ఆదాయం రూ. 64,92,590
ఆలేరు, జనవరి 20: పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్య కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం వేకువజామునకే స్వయంభులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపి ఉత్సవ మండపంలో ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను దివ్య మనోహరంగా అలంకరించి శ్రీ సుదర్శన నారసింహహోమం అనంతరం లక్ష్మీనరసింహుల కల్యాణం జరిపారు. స్వామివారి అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రోజూ ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ భక్తులు లక్ష్మీనృసింహుడిని కొలుస్తున్నారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది. కొండపైన గల శివాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హుండీల ఆదాయం రూ. 64,92,590
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి 16 రోజుల హుండీల ఆదాయం రూ. 64 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. బుధవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్లో హుండీలు లెక్కించామని, నగదు రూ. 64,92,590 వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 48 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 700 గ్రాములు వచ్చిందన్నారు.
శ్రీవారి ఖజానాకు రూ. 8,30,483 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 8,30,483 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 55,916, రూ. 100 దర్శనం ద్వారా రూ. 53,100, ప్రచారశాఖ ద్వారా రూ. 545, క్యారీబ్యాగుల ద్వారా రూ. 4,250, వ్రతాల ద్వారా రూ. 49,000, కల్యాణకట్ట ద్వారా రూ. 16,800, ప్రసాద విక్రయం ద్వారా రూ. 4,48,860, వాహనపూజల ద్వారా రూ. 11,600, టోల్గేట్ ద్వారా రూ. 1,130, అన్నదానవిరాళం ద్వారా రూ. 56,201, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 62,640, యాదరుషి నిలయం ద్వారా రూ. 48,470, పుష్కరిణి ద్వారా రూ. 350, పాతగుట్ట ద్వారా రూ. 11,505, ఇతర విభాగాలు రూ. 8,116తో కలిపి రూ. 8,30,483 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు