భక్తుల సందడి

- యాదాద్రి కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు
- ఉత్సవమూర్తులకు అభిషేకం
- వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు
- శ్రీవారి ఖజానాకు రూ. 24,62,170 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మొక్కు పూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోసారి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
-ఆలేరు, జనవరి17
ఆలేరు, జనవరి 17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఇలవే ల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోమారు పోటెత్తింది. ఎటు చూసినా క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కుటుం బ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించుకునేందుకు గంటల కొద్దీ క్యూలో నిలబడ్డారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచే మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తుల కు అభిషేకం చేశారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. శ్రీసుదర్శన నారసింహ హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహిం చే నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖమండపంలో ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకుపైగా కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణమూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖమండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణతంతు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సా యంత్రం వేళ అలంకారజోడు సేవ లు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీపర్వతవర్ధినీసమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
లక్ష్మీనరసింహస్వామి వా రిని గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి సురేంద్ర మోహన్‌తోపాటు, ఎంప్లాయిమెంట్ ఎక్స్ంజ్ డైరెక్టర్ యాకూబ్ నాయక్ కుటుం బసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి ఖజానాకు రూ. 24,62,170 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 24,62,170 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.3,99, 142, రూ.100 దర్శనంతో రూ.18,500, రూ. 150 దర్శనం తో రూ. 3,30,000, ప్రచారశాఖ ద్వారా రూ. 4,225, క్యారీ బ్యాగులతో రూ.7,675, వ్రతాల ద్వారా రూ.1,00,500, కల్యాణకట్టతో రూ.40,760, ప్రసాద విక్రయం ద్వారా రూ. 11,62, 980, శాశ్వత పూజల ద్వారా రూ. 26,232, వాహనపూజలతో రూ.20,500, టోల్గేట్ ద్వారా రూ. 2,420, అన్నదాన విరాళంతో రూ.34,793, సువర్ణపుష్పార్చనతో రూ. 1,52,448, యాదరుషి నిలయంతో రూ. 87,610, పుష్కరిణి ద్వారా రూ. 1,300, పాతగుట్టలో రూ. 64,995, ఇతర విభాగాలతో రూ. 8,090తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ. 24,62,170 ఆదాయం సమకూరిందని వారు తెలిపారు,
తాజావార్తలు
- మహిళ ఫిర్యాదుతో ఆప్ ఎమ్మెల్యేపై వేధింపుల కేసు
- సచిన్ ముందే చూడకుండా రుబిక్ క్యూబ్‌ని సెట్ చేశాడు..వీడియో వైరల్
- ‘4-5 రోజుల తర్వాత మరణిస్తే టీకాతో సంబంధం లేనట్లే..’
- ఝరాసంగం కేజీబీవీలో కరోనా కలకలం
- బీపీసీఎల్ ఫర్ సేల్: నుమలీగఢ్ రిఫైనరీతో షురూ..!
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు