గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 18, 2021 , 00:17:29

అ‘పూర్వ’ సమ్మేళనం

అ‘పూర్వ’ సమ్మేళనం

భూదాన్‌పోచంపల్లి, జనవరి 17: పోచంపల్లి పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదోతరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జేవీ ఫంక్షన్‌ హాలులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 26 ఏండ్ల క్రితం పదోతరగతి చదివిన విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా నాడు తమకు విద్యాబుద్ధ్దులు చెప్పిన గురువులను సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సం దర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గుణింటి సుభాశ్‌, కుందారపు జంగయ్య, దోర్నాల సత్యనారాయణ, జేజేల మల్లేశ్‌, ఇంజమూరి ఆంజనేయులు, తంతరపల్లి రాజు, చిక్క విష్ణుమూర్తి, చెక్క వెంకటేశం, చెరుకు వెంకటే శం, భోగ సత్యనారాయణ, బాల్‌రెడ్డి, రావుల ఐలయ్య, బాస బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తమతో చదువుకున్న మిత్రుడు అకాల మరణం పొందడంతో యాలాల మహే శ్‌ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. 

బీబీనగర్‌లో..

బీబీనగర్‌, జనవరి17: మండలంలోని కొండమడుగు గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన (2009-10) పదోతరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తమకు విద్యను నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 

VIDEOS

logo