ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 18, 2021 , 00:17:28

రద్దీగా పంతంగి టోల్ ప్లాజా

రద్దీగా పంతంగి టోల్ ప్లాజా

చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి17 : సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి భాగ్యనగరం బాటపట్టా రు. దీంతో ఆదివారం 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు స్తంభించాయి. మొత్తం 16 టోల్‌బూత్‌లకుగానూ హైదరాబాద్‌ వైపు 9 తెరిచారు. అందులో 8 ఫాస్టాగ్‌, ఒకటి నగదు చెల్లింపునకు కేటాయించారు. అన్నింటిలోనూ ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్‌ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చౌటుప్పల్‌ పట్టణకేంద్రంలో సైతం వాహనాలు బారులుతీరాయి. మండల పరిధిలోని జాతీయ రహదారిపై వివిధ గ్రామాలకెళ్లే ప్రజలు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ దృ ష్ట్యా తంగడపల్లి రోడ్డు క్రాసింగ్‌ను కూడా మూసేశారు. దీంతో స్థానిక, సంస్థాన్‌నారాయణపురం వైపు వెళ్లే వాహనదారులు నాగారం క్రాస్‌ రో డ్డు  వద్ద యూటర్న్‌ తీసుకున్నారు.  

VIDEOS

logo