అవినీతికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి

బీబీనగర్, జనవరి16: గ్రామ పంచాయతీకి చెందిన భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసిన గూడూరు సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డిపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, పంచాయతీ ఆస్తులను కాపాడాలని గ్రామ కో-ఆప్షన్ సభ్యుడు పరమేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు గ్రామస్తులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిధిలోని 174, 175, 178 సర్వే నెంబర్లలో 2010 లో శ్రీయా ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ పేరుతో ప్రస్తుత సర్పంచ్ బాల్‌రెడ్డి వెంచర్ చేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిశాతం భూమి 1,716 గజాల స్థలాన్ని గ్రామపంచాయతీకి కేటాయించారు. కాగా 2015లో పంచాయతీకి కేటాయించిన భూమిలో నుంచి 391 గజాల స్థలాన్ని బాల్‌రెడ్డి అక్రమంగా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేసినట్లు వారు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌తోపాటు డీపీవో, ఆర్డీవో, డీసీపీ, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పంచాయతీకి కేటాయించిన స్థలం విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.4కోట్లకు పైగా పలుకుతున్నదని, ఉన్నతాధికారులు విచారణ చేప ట్టి సర్పంచ్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు పం చాయతీ భూమిని కాపాడాలని కోరారు. దీనిపై సర్పంచ్ బాల్‌రెడ్డిని వివరణ కోరగా.. ఇందులో తన ప్రమేయం ఏమిలేదని, తనకు భూమిని విక్రయించిన వ్యక్తి గ్రామపంచాయతీకి కేటాయించిన భూమికి సైతం తన వద్ద డబ్బులు తీసుకున్నాడు. 174 సర్వేనెంబర్‌లోని 391 గజాల స్థలం అప్పట్లో పంచాయతీకి కేటాయించినట్లు నాకు తెలియకపోవడంతో వేరొక వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు నోముల నర్సిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, తొర్పునూరి రాజశేఖర్‌గౌడ్, పానుగంటి నర్సింహచారి, వనం శ్రీశైలం, అంకర్ల రమేశ్, సత్యనారాయణ, హైమద్ పాష, గడ్డం జంగారెడ్డి, యాదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వనం సురేశ్, రాగీరు శ్రీనివాస్, శ్రీనివాస్, బలరాం, మేకల శ్రీనివాస్, మహేశ్, రాగీరు సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ట్రాన్స్ఫార్మర్పై పడిన చీరను తీస్తుండగా..
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!