ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 16, 2021 , 02:22:46

టీకా పంపిణీకి కార్యాచరణ పూర్తి

టీకా పంపిణీకి కార్యాచరణ పూర్తి

భువనగిరి అర్బన్‌, జనవరి 15: జిల్లాలో కరోనా టీకా పంపిణీకి కార్యాచరణ పూరైందని   కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు.  జిల్లాలోని మూడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వ్యాక్సిన్‌ తీసుసుకువెళ్తున్న వాహనాన్ని శుక్రవారం ప్రభుత్వ ఏరియా దవాఖానలో జెండా ఊపి  ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ఇప్పటికే కొండమడుగు పీహెచ్‌సీ, చౌటుప్పల్‌ సీహెచ్‌సీ, భువనగిరి ఏరియా దవాఖాన సెంటర్లకు టీకా చేరుకుందన్నారు. జిల్లాకు 1160 కొవిడ్‌ డోసులు వచ్చాయన్నారు. తొలి టీకా ప్రభుత్వ దవాఖానల సిబ్బందికి ఆతర్వాత ప్రైవేట్‌, అంగన్‌వాడీ సిబ్బందితో పాటు పోలీస్‌, పారిశుధ్య కార్మికులకు విడుతల వారీగా ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు.  ప్రతి సెంటర్‌లో 30 మందికి టీకా వేస్తారన్నారు.  వ్యాక్సిన్‌ మూడు దశల్లో వేస్తారని, టీకా వేసిన మొదట రోజు  నుంచి 45 రోజుల లోపు రెండో టీకా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 18 సంవత్సరాలలోపు వారికి, గర్భిణులకు టీకా వేయడంపై ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు.  కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, జడ్పీసీఈవో కృష్ణారెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo