వ్యాక్సినేషన్లో జాగ్రత్తగా ఉండాలి

కలెక్టర్ అనితారామచంద్రన్
బీబీనగర్, జనవరి 13: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొనసాగనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ఈనెల 16న పీహెచ్సీ సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్న నేపథ్యంలో బుధవారం కొండమడుగులోని పీహెచ్సీలో ఏర్పాటు చేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ వేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని పీహెచ్సీ వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారులు ప్రవీణ్, దాక్షాయణి, గీత పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
చౌటుప్పల్ జనవరి 13 : చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ అనితారామచంద్రన్ బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈనెల 16న చౌటుప్పల్‌లోని ఆరోగ్య సిబ్బందికి వేయనున్న కొవిడ్-19 వ్యాక్సినేషన్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చౌటుప్పల్, కొండమడుగు, భువనగిరి సెంటర్లలో వ్యాక్సినేషన్ వేయనున్నట్లుగా తెలిపారు. తొలిరోజు ప్రతి సెంటర్లో 30మంది చొప్పున 90 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్ల ప్రక్రియను ప్రకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో మనోహర్, డీఎంవో రామయ్య, డా.సుభాషిణి, డా. పాండురంగమ్, డా.హర్ష, డా.కాటంరాజు, సత్యనారాయణ ఉన్నారు.
తాజావార్తలు
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి