గురువారం 04 మార్చి 2021
Yadadri - Jan 14, 2021 , 00:03:12

హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కే తొలి వ్యాక్సిన్‌

హెల్త్‌కేర్‌ వర్కర్స్‌కే తొలి వ్యాక్సిన్‌

16న తొలి టీకా మొదటి దశ  

మొదటి టీకా 4,584 మందికి..

జిల్లాకు మొదటగా 1,160 డోసులు

జిల్లాలో మొదటి రోజు 3 కేంద్రాల్లో ప్రారంభం 

రెండు ప్రభుత్వ, ఒక ప్రైవేటు దవాఖానల్లో..

మిగిలిన వారికి 18 నుంచి 24 సెంటర్లలో.. 

టీకా వేయడానికి స్టాఫ్‌నర్స్‌, వైద్యులకు శిక్షణ పూర్తి

‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో సాంబశివరావు

భువనగిరి అర్బన్‌, జనవరి 13: ప్రపంచాన్ని వణికించిన కంటికి కనిపించని వైరస్‌ నివార ణకు వ్యాక్సిన్‌ ఎట్టకేలకు రానే వచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఈనెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వ్యా క్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయించడంతో  జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఇప్పటికే డ్రైరన్‌ నిర్వ హించడంతోపాటు వ్యాక్సినేషన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్‌ కోసం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాం. జిల్లాకు మొదటి విడుతగా 116 ఇంజిక్షన్లు, ఒక్కోక్క ఇంజిక్షన్‌లో పది మందికి సరిఫడా వ్యాక్సిన్‌ ఉండగా, మొత్తం కలిపి 1160 మందికి వేసే వ్యాక్సిన్‌ జిల్లాకు వచ్చింది. మిగితా సిబ్బందికి వేయడానికి విడుతల వారీగా వ్యాక్సిన్‌ రానున్నది. కరోనా వ్యాక్సినేషన్‌ టీకాను జిల్లాలో మొదటి టీకా ఎప్పుడు, ఎవరెవరికి వేస్తారు అనే విషయాలను జిల్లా వైద్యాధికారి సాంబశివరావు ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

నమస్తే తెలంగాణ : జిల్లాలో మొదటి టీకా ఎప్పుడు వేస్తారు? 

ఎవరు వేస్తారు?

డీఎంహెచ్‌వో : కరోనా వ్యాక్సిన్‌ మొదటి టీకా ఈనెల 16న వేస్తాం. ఇప్పటికే జిల్లాలో 22 సెంటర్లలో డ్రైరన్‌ నిర్వహించాం. టీకా వేయడానికి వైద్య సిబ్బంది, స్టాఫ్‌నర్స్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. జిల్లాకు కరోనా నివారణ వ్యాక్సిన్‌ ఇప్పటికే చేరుకున్నది. భువనగిరి ఏరియా దవాఖానలోని ప్రత్యేక ఏసీ గదిలో ఉంచాం. వ్యాక్సినేషన్‌ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. టీకా పంపిణీకి 3 ప్రత్యేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

న.తె : మొదటి టీకా వేయడానికి జిల్లాలో ఎన్ని సెంటర్లు, ఎక్కడెక్కడా ఏర్పాటు చేశారు? అం దులో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు ఎన్ని? 

డీఎంహెచ్‌వో : మొదటి రోజు టీకా వేయడానికి మూడు సెంటర్లు ఏర్పాటు చేశాం. 1. భువనగిరిలో రాధాకృష్ణ ప్రైవేటు దవాఖాన. 2. కొండమడుగులోని పీహెచ్‌సీ. 3. చౌటుప్పల్‌లోని సీహెచ్‌సీ (తంగడపల్లి). 

న.తె : ఒక్కో సెంటర్‌లో ఎంత మందికి వేస్తారు? టీకా వేయడానికి ఎంత మంది సిబ్బంది ఉంటారు?

డీఎంహెచ్‌వో : రాష్ట్ర ఆర్యోగశాఖ ఆదేశాల మేరకు మొదటిరోజు ప్రతి సెంటర్‌లో 30మందికి మాత్రమే టీకా వేస్తాం. ఎక్కువ మందికి వేయవచ్చు కానీ టీకా వేసిన వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించేందుకు తక్కువ మందికి వేస్తాం. ప్రతి సెంటర్‌లో టీకా వేసేందుకు ఆరుగురు, టీకా వేసిన వారి పరిస్థితిని తెలుసుకోవడానికి ఒక డాక్టర్‌, సూపర్‌వైజర్‌ ఉంటాడు. 

న.తె : మొదటి విడుతలో ఏ ఏ సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందికి వేస్తారు? ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బంది ఎంత మంది? 

డీఎంహెచ్‌వో : మొదటి విడుతలో ప్రభుత్వ దవాఖానలో పనిచేసే సిబ్బందికి, అంగన్‌వాడీలో పనిచేసే సిబ్బందికి, ప్రైవేటు దవాఖానల్లో పనిచేసే సిబ్బందికి వేస్తాం. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 22, జిల్లా దవాఖాన - 1, కమ్యూనిటీ సెంటర్స్‌-3, ఇందులో మొత్తం 1772 సిబ్బంది, అంగన్‌వాడీలో 1817 సిబ్బంది, ప్రైవేటు దవాఖానలో 716 సిబ్బందితోపాటు బీబీనగర్‌ ఎయిమ్స్‌ దవాఖానలో 279 మందికి వేస్తాం. ఇప్పటికే వారి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చడంతోపాటు వారి ఫోన్‌కు మెసేజ్‌లు కూడా పంపించాం. 

న.తె : మిగిలిన సిబ్బందికి ఎప్పుడు? ఎన్ని సెంటర్లలో వేస్తారు?

డీఎంహెచ్‌వో : 16వ తేదీన తొలి టీకా చేయగా, మిగిలిన సిబ్బందికి 18, 19, 21, 22వ తేదీ వరకు రోజు రోజుకు పెంచుతూ వేస్తాం. 18వ తేదీ నుంచి జిల్లాలోని 24 సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ వేస్తాం. జిల్లాలోని 24 పీహెచ్‌సీలు అడ్డగూడూరు, ఆత్మకూర్‌(ఎం), బీబీనగర్‌, బొల్లెపల్లి, బొమ్మలరామారం, గుండాల, కొండమడుగు, మోట కొం డూర్‌, మోత్కూర్‌, మునిపంపుల, సంస్థాన్‌నారాయణపూర్‌, భూదాన్‌ పోచంపల్లి, రాజాపేట, షారాజిపేట, తుర్కపల్లి, యూపీహెచ్‌సీ భువన గిరి, వలిగొండ, వర్కట్‌పల్లి, వేములకొండ, యాదగిరిగుట్ట, జిల్లా దవా ఖాన భువనగిరి, చౌటుప్పల్‌ సీహెచ్‌సీ, ఏరియా దవాఖాన రామన్న పేట, బీబీనగర్‌ ఎయిమ్స్‌ సెంటర్లలో వేస్తారు. ప్రతిరోజు వ్యాక్సినేషన్‌ వేయడం పరిస్థితులను బట్టి పెంచుతూ ఉంటారు. జిల్లాలో మొదటి విడుతలో 4,584 మందికి తొలి టీకాను వేయనున్నాం. 

న.తె : వ్యాక్సిన్‌ నిల్వకు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటారు?

డీఎంహెచ్‌వో : డీఫ్రీజ్‌లు 3, ఐఎల్‌ఆర్‌ ఫ్రిజ్‌లు 4, కోల్డ్‌ బాక్సులు 11, వ్యాక్సిన్‌ క్యారియర్స్‌ 150, కోల్డ్‌చైన్‌ పాయింట్స్‌ 21, వ్యాక్సినేటర్స్‌ 222 అందుబాటులో ఉన్నారు.

న.తె : టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో ఎవరెవరు ఉంటారు? వారి పర్యవేక్షణ ఉంటుందా?

డీఎంహెచ్‌వో : టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో 14 మంది ఉంటారు. వారి పర్యవేక్షణ ఉంటుంది. కమిటీలో రెవెన్యూ, రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ట్రైబర్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌, పబ్లిక్‌ రిలేషన్‌ జిల్లా అధికారులతోపాటు మండల అధ్యక్షుడు, మండల పంచాయతీ అధికారి, ప్రోగ్రాం అధికారి, అసిస్టెంట్‌ డివిజన్‌ ఇంజినీర్‌, మండలాల్లోని అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులు కమిటీలో ఉంటారు. 

VIDEOS

తాజావార్తలు


logo