బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 13, 2021 , 00:08:11

యాదాద్రీశుడికి పూజలు

యాదాద్రీశుడికి పూజలు

వైభవంగా తిరుప్పావై పూజలు

శ్రీవారి ఖజానాకు   రూ. 7,55,102 ఆదాయం

ఆలేరు, జవనరి12: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం సంప్రదాయ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. వేకువజామునే స్వామివారిని బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో అభిషేకించి తులసీఅర్చనలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు చేపట్టారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాథుడిపై రచించిన పాశురాలను పఠించి భక్తులకు వినిపించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్‌ అమ్మవారికి మూడో రోజు నిరటోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేడుకలు జరిపారు. గోదాదేవికి మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. 

వైభవంగా  నిత్యపూజలు

యాదాద్రి బాలాలయంలో నిత్యపూజలు  వైభ

వంగా జరిగాయి. లక్ష్మీనరసింహులను అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సాయం త్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు వైభవంగా జరిపారు. కొండపైన గల రామలింగేశ్వరబాలాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. పంచారాత్రగమశాస్త్రం ప్రకారం స్వామిఅమ్మవార్లకు మహానివేదన జరిపి శయనోత్సవం నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం గావించి ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు.

 రూ. 7,55,102 ఆదాయం

శ్రీవారి ఖజానాకు రూ. 7,55,102 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 74,096, రూ. 100 దర్శనం ద్వారా రూ. 31,000, ప్రచారశాఖ ద్వారా రూ. 5,800, క్యారీబ్యాగుల ద్వారా  రూ. 3,650, వ్రతాల ద్వారా రూ. 35,000, కల్యాణకట్ట ద్వారా రూ. 12,000, ప్రసాద విక్రయం ద్వారా రూ. 4,01,325, శాశ్వత పూజల ద్వారా రూ. 18,348, టోల్‌గేట్‌ ద్వారా రూ. 700, అన్నదానవిరాళం ద్వారా రూ. 5,615, సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 84,644, వాహనపూజల ద్వారా రూ. 3,600, యాదరుషి నిలయం ద్వారా రూ. 38,900, పుష్కరిణి ద్వారా రూ. 800, ఇతర విభాగాలు రూ. 39,624తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.  7,55,102 ఆదాయం సమకూరినట్లు వారు తెలిపారు.


VIDEOS

logo