బిగ్‌బాస్ సోహెల్.. కథ వేరే ఉన్నది

అనాథలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలి
బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్
అనాథాశ్రమాలకు హీరో నాగార్జున రూ.10 లక్షల విరాళం...
అందులో నుంచి రూ.2లక్షలు అమ్మానాన్న ఆశ్రమానికి...
అనాథలకు సేవ చేయడం అదృష్టం : సినీ నటుడు సయ్యద్ సోహెల్
చౌటుప్పల్, జనవరి 11: అనాథలకు సేవచేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావించాలి..భవిష్యత్‌లో10 నుంచి 15శాతం వరకు అనాథల సంక్షేమానికి ఖర్చు చేస్తానని బిగ్‌బాస్ షో కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని సోమవారం సాయంత్రం ఆయన సందర్శించగా మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆయన అనాథలతో ముచ్చటించారు. అనాథల శ్రేయస్సు కోసం ఏమి చేస్తున్నారని ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్‌తో కలిసి కొంతమంది అనాథలకు సోహెల్ అన్నదానం చేశారు. ఆశ్రమ సంక్షేమానికి రూ. 2లక్షల చెక్కు అందజేశారు.అనంతరం సోహెల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. బిగ్‌బాస్ షో ద్వారా జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు. బిగ్‌బాస్ షో విన్నరైతే రూ. 10లక్షలు అనాథలకు కేటాయిస్తానని చెప్పగా.. బిగ్‌బాస్ షో హోస్ట్, ప్రముఖ సినీహీరో నాగార్జున సార్ తనను వారించి తనకు బదులు ఆయనే రూ. 10లక్షలు ఇచ్చారన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనాథలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. 400 మంది అనాథలను చేరదీసి ఆదరిస్తున్న అమ్మానాన్న అనాథాశ్రమ నిర్వాహకుడిని ఆయన అభినందించారు. కాగా చౌటుప్పల్‌కు వచ్చిన సయ్యద్సోహెల్తో ఫొటోలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు.
తాజావార్తలు
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు