ప్రశ్నించేవారికన్నా పనిచేసేవారే మిన్న

ఆరేండ్లలో లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ
రాష్ర్టానికి 13,500 కంపెనీల పెట్టుబడులు
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
భూదాన్‌పోచంపల్లి, భువనగిరి అర్బన్, జనవరి 11: ప్రశ్నించేవారికన్నా పనిచేసేవారే మిన్న అని, అందుకే పనిచేసే వారినే గెలిపించాలని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని జూలూరుతోపాటు భువనగిరి వైఎస్సార్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు ముందు నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని ఉద్యమించామని, తెలంగాణ ఏర్పాటు తర్వాత వాటిని సాధించుకున్నామన్నారు. రాష్ర్టాన్ని నేడు సీఎం కేసీఆర్ ప్రాజెక్టులతోపాటు సాగునీటి కాల్వలు, చెరువుల ద్వారా సస్యశ్యామలం చేశారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెరువులకు జలకళను తీసుకురావడంతోపాటు పాలమూరు ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పాటైన ఆరు సంవత్సరాల్లోనే లక్షా 35 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఐటీ రంగంలో ప్రగతిని సాధించడంతోపాటు 13,500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఐటీ రంగంలో కూడా సుమారు 14 లక్షల 50 వేల ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ..పథకాల రూపకల్పనలో సీఎం కేసీఆర్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మ్న్ సందీప్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జడల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, భువనగిరి, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు నల్లమాస రమేశ్‌గౌడ్, కవిత, టీఆర్ఎస్ భువనగిరి పట్టణ, మండల అధ్యక్షులు గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, ఎంపీపీలు మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి,ఎరుకల సుధాకర్ గౌడ్, జడ్పీటీసీలు కోట పుష్పలత మల్లారెడ్డి, గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ పోచంపల్లి, బీబీనగర్ మండలాల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్, పోచంపల్లి పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేశం, సింగిల్‌విండో చైర్మన్లు భూపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, బొక్క జైపాల్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు పాక వెంకటేశం,గణేశ్‌రెడ్డి, మున్పిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి పాల్గొన్నారు.
తాజావార్తలు
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జునర్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!