ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 11, 2021 , 00:09:29

మహిళా కమిషన్‌ సభ్యురాలికి ప్రభుత్వ విప్‌ అభినందనలు

మహిళా కమిషన్‌ సభ్యురాలికి ప్రభుత్వ విప్‌ అభినందనలు

ఆలేరు, జనవరి 10 : టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణతో కష్టపడే కార్యకర్తలకు సరైన సమయంలో సరైన గౌరవం దక్కుతుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. క్రమశిక్షణ కలిగిన మహిళా నాయకురాలు షాహిన్‌కు రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలి స్థానాన్ని కల్పించిన సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వవిప్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్ట ర్‌ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్‌ను రాష్ట్ర మహిళా కమిషన్‌ షాహిన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ షాహిన్‌ను అభినందించి శు భాకాంక్షలు తెలిపారు. నాటి మలిదశ తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుని, సీనియర్‌ మైనార్టీ కార్యకర్తకు మంచి గుర్తింపు లభించిందని అన్నారు.

VIDEOS

logo