సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 11, 2021 , 00:09:29

బర్డ్‌ప్లూపై అప్రమత్తం

బర్డ్‌ప్లూపై అప్రమత్తం

జిల్లాలో మొత్తం 20 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు ఏర్పాటు

లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటున్న అధికారులు 

తగ్గిన కొనుగోళ్లు, ప్రభావం చూపుతున్న బర్డ్‌ ఫ్లూ భయం

జిల్లాలో చికెన్‌ ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నెల ఒకటిన కిలో చికెన్‌  (స్కిన్‌లెస్‌) రూ.183 ఉండగా, ఆదివారానికి రూ.165కి చేరింది. ఉత్తరాది రాష్ర్టాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బర్డ్‌ ఫ్లూ భయం కొనుగోళ్లపై పడింది. ఈనేపథ్యంలో పశుసంవర్ధకశాఖ, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో పశుసంవర్ధకశాఖ అధికారులు సమావేశమై వైరస్‌వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.  

-భువనగిరి అర్బన్‌, జనవరి10

బర్డ్‌ ఫ్లూ లక్షణాలు లేవు

జిల్లాలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదు.  ప్రజలు వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దు. పశుసంవర్ధకశాఖ, అటవీ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో మొత్తం 20 ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేశాం. మూడు రోజులుగా ఈ బృందాలు జిల్లాలోని  కోళ్ల ఫారాలకు వెళ్లి పరీక్షిస్తున్నాయి. వాటి రక్త నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని వెటర్నరీ బయాలాజికల్‌ రీసెర్స్‌ ఇనిస్టిట్యూట్‌కు పంపిస్తున్నాయి. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయితే వ్యాధి సోకిన ఫారాల్లోని అన్ని కోళ్లను చంపి పూడ్చివేస్తారు.  శానిటైజేషన్‌ చేసి వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటారు. ఎక్కడైనా కాకులు, నెమ్మళ్లు మూకుమ్మడిగా మృత్యువాత పడితే వాటిని ముట్టుకోకుండా సంబంధిత వైద్యాధికారులకు తెలియజేయాలి. బర్డ్‌ఫ్లూ వైరస్‌ సాధారణంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద చనిపోతుంది. మనం చికెన్‌ను 100 డిగ్రీల సెంటీగ్రేడ్‌ దాకా ఉడికిస్తాం కాబట్టి వైరస్‌తో మనకు ప్రమాదం ఉండదు. 

-కృష్ణ, పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి

భువనగిరి అర్బన్‌, జనవరి 10:  దేశంలోని ఉత్తరాది రాష్ర్టా ల్లో కోళ్లకు బర్డ్‌ప్లూ వ్యాధి సోకిందనే (వదంతులు)వార్తల నేపథ్యంలో జిల్లావాసులు చికెన్‌ తినేందుకు ఆసక్తి చూపడంలేదు. దీంతో అంతంత మాత్రంగానే విక్రయాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దాదాపుగా 90 శాతం మంది చికెన్‌ తినడాన్ని తగ్గించుకున్నారు. బర్డ్‌ఫ్లూ వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రం లో ఆ వైరస్‌ లక్షణాలు ఎక్కడ కనిపించలేదని అధికారులు పేర్కొంటున్నారు.

బర్డ్‌ప్లూ భయం ..

 జిల్లాలో వివాహ, శుభకార్యాలు జరిగిన జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు చికెన్‌ ధరలు రోజురోజుకూ తగ్గుము ఖం పట్టాయి. డిసెంబర్‌ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోళ్ల ధరలు రోజురోజుకూ పెరుగుతుంటాయి. కానీ హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల్లో కోళ్లకు బర్డ్‌ప్లూ వ్యాధి సోకిందనే వార్తల నేపథ్యంలో రాష్ట్రంలోని ఫౌల్ట్రీ వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. కోళ్లను చికెన్‌ సెంటర్లకు తక్కువ ధరకు తరలించి విక్రయి స్తుండటంతో కొనుగోలు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని   పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు లేవని, వ్యాధి నిర్థారణ కాలేదని పశుసంవర్ధకశాఖ మంత్రి చెప్పినా ప్రజలు మాత్రం భయం తో చికెన్‌ తినడాన్ని తగ్గించారు. 

తగ్గిన చికెన ధరలు..

ఇతర రాష్ర్టాల్లో కోళ్లకు బర్డ్‌ప్లూ వ్యాధి సోకిందనే భయంతో జిల్లాలోని ఫౌల్ట్రీ వ్యాపారులు అప్రమత్తమయ్యారు. తమ తమ ఫారాల్లో ఉన్న కోళ్లను ఎలాంటి లాభాలను ఆశించకుండా ధరలను తగ్గించి చికెన్‌ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.


VIDEOS

logo