శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jan 11, 2021 , 00:09:26

రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలి

రిజర్వాయర్‌ పనులను వేగవంతం చేయాలి

ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌

భువనగిరి, జనవరి 10 : బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనులను వేగవంతంగా చేపట్టి నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్‌ సూచించారు. ఆదివారం మండలంలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ సమీపంలో నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, ఇంజినీరింగ్‌ చీఫ్‌లు మురళీధర్‌రావు, హరిరామ్‌లతో కలిసి  ఆమె ప్రాజెక్టు కట్ట నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టు పనులను అనుకున్న మేరకు పూర్తి చేసేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. బస్వాపూర్‌ 16ప్యాకేజీ 1.5టీఎంసీ సామర్ద్యంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, శిక్షణ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, ఇంజినీరింగ్‌ శాఖ అధికారులు ఏఎస్‌ఎన్‌రెడ్డి, కుర్షిద్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo