ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 11, 2021 , 00:09:45

రాచకొండలో పర్యాటకులు సందడి

రాచకొండలో  పర్యాటకులు సందడి

సంస్థాన్‌ నారాయణపురం, జనవరి 10 : రాజులు ఏలిన కొండ రాచకొండలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. అందమైన రాచకొండ అందాలను తిలకించడానికి హైదరాబాద్‌, నల్లగొండ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో రాచకొండ పరిసరాలు కిటకిటలాడాయి. రాచకొండ ప్రాంతంలోని స్వయంభూ రామలింగేశ్వరస్వామి దేవాలయం, గాలిబ్‌ షాహీ దర్గా, రాచకొండ ఫోర్టు, సంకెళ్లబావి, రామాలయం తదితర ప్రదేశాలను చూసి పర్యాటకులు మైమరిచి పోయారు. కుటుంబసభ్యులు చిన్నారులతో కలిసి ఆడుతుపాడుతూ సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం వనభోజనాలు చేసుకుని సేదతీరారు.

VIDEOS

logo