శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 10, 2021 , 00:06:00

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం తథ్యం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం తథ్యం

మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య 

ఆలేరు టౌన్‌, జనవరిర 9 : నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం తథ్యమని మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య అన్నారు. ఆలేరులో శనివారం టీఆర్‌ఎస్‌ యూత్‌, విద్యార్థి విభాగం నాయకుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషి చేయలని కోరారు. ఈ నెల 12న పట్టణంలో డీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ప్రభుత్వ విప్‌ సునీత, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి సమక్షంలో జరిగే సమావేశానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, అయిలి కృష్ణ, మామిడాల భాను, పంతం కృష్ణ, పూల శ్రవణ్‌, రాయపురం నర్సింహులు, సీస రాజేశ్‌, కూళ్ల సిద్ధులు, ఫయాజ్‌, అంకిరెడ్డి కృష్ణ, ఆలేటి అనిల్‌, బండ జహంగీర్‌, బైరి మహేందర్‌, ఆలేటి నాగార్జున పాల్గొన్నారు. 

ఆరోగ్యానికి క్రీడలు ఎంతో ముఖ్యం 

వ్యక్తిత్వ వికాసానికి చదువు ఎంత ముఖ్యమో.. పరిపూర్ణమైన ఆరోగ్యానికి క్రీడలు కూడా అంతే ముఖ్యమని మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య అన్నారు. ఆలేరు జడ్పీ ఉన్నతపాఠశాల మైదానంలో శనివారం ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి సంక్రాంతి క్రీడలను ఆయన ప్రారంభించారు. పూల నాగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మోటకొండూరు వైస్‌ ఎంపీపీ మల్లేశం, మాజీ ఎంపీటీసీ ఎండీ జైనుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌నాయక్‌, బాలస్వామి, ఎంఏ ఎజాజ్‌, సెలివేరు నరేశ్‌, గడసంతల మధుసూదన్‌, విజయ్‌కుమార్‌, చంద్రకుమార్‌, భానుప్రకాశ్‌, అల్తాఫ్‌, నరేశ్‌, చింటు పాల్గొన్నారు.


VIDEOS

logo