ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 09, 2021 , 00:41:04

కరోనా వ్యాక్సిన్ కు సర్వం సిద్ధం

కరోనా వ్యాక్సిన్ కు సర్వం సిద్ధం

  • కొనసాగిన డ్రైరన్‌
  • పరిశీలించిన ఆయా శాఖల అధికారులు

వలిగొండ, జనవరి 8 : కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ను ఆమె పరిశీలించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైరన్‌ ఏర్పాట్లను పరిశీలించామన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా నివారణకు వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం కొవిడ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పేరు నమోదు చేసుకున్న వారు గుర్తింపు కార్డుతో వ్యాక్సిన్‌ కేంద్రానికి రావాలని, వ్యాక్సిన్‌ వేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిని అరగంట పాటు వ్యాక్సినేటర్‌ కేంద్రంలో ఉంచి పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఆర్డీవో సూరజ్‌కుమార్‌, ఎంపీడీవో గీతారెడ్డి, తహసీల్దార్‌ నాగలక్ష్మి, వైద్యాధికారులు వై.పాపారావు, సుమన్‌ కల్యాణ్‌, కిరణ్‌కుమార్‌, సుమలత, వైద్య సిబ్బంది ఏ.సంతోష్‌, సువర్ణకుమారి, శ్రీనివాస్‌, లలిత, శౌరి, ప్రీతంబాబు, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డ్రైరన్‌ విజయవంతం..

ఆలేరు, జనవరి 8 : కరోనా మహమ్మారి బారిన పడుకుండా ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ముందు చేపట్టిన డ్రైరన్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట, మోటకొండూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కార్యక్రమం నిర్వహించారు.  మూడు గదులను కేటాయించి అందులో మొదటి గదిలో వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారికి కూర్చోబెట్టారు. రెండో గదిలో వ్యాక్సినేషన్‌ వేశారు. మరో గదిలో వ్యాక్సినేషన్‌ వేసిన వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. యాదగిరిగుట్ట పీహెచ్‌సీలో డ్రైరన్‌ ఏర్పాట్లను ట్రైనీ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌  పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభాకర్‌రెడ్డి, మండల వైద్యాధికారి వంశీకృష్ణ, మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

సమస్యలను అధిగమించేందుకే డ్రైరన్‌..

కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా చేపట్టిన డ్రైరన్‌ లో లోటుపాట్లను గుర్తించి అసలైన టీకా వచ్చే నాటికి అధిగమించేందుకే వ్యాక్సిన్‌ డ్రైరన్‌ చేపట్టామని అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ తెలిపారు. శుక్రవారం మోటకొండూర్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డ్రైరన్‌ను పరిశీలించి, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాజేందర్‌నాయక్‌, వైద్య సిబ్బంది ప్రవీణ్‌కుమార్‌, యాకయ్య తదితరులు ఉన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ పరిశీలన..

ఆత్మకూరు(ఎం), జనవరి 8 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రై రన్‌ కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను అదనపు కలెక్టర్‌ కీమ్యానాయక్‌ డీఎంహెచ్‌వో సాంబశివరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో అందుబాటులోకి రానున్నట కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య సిబ్బందికి వేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారి వివరాలను పరిశీలించి ప్రతిరోజు 25 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయనున్నామన్నారు. మొదటి వ్యాక్సిన్‌ వేసిన వారికి 28 రోజుల తరువాత వారి ఆరోగ్య పరిస్థితులను గుర్తించి 2వ విడుత వ్యాక్సిన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నోడల్‌ అధికారి రామయ్య, మండల ప్రత్యేకాధికారి శ్యామ్‌, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో రాములు, మండల వైద్యాధికారిణి ప్రణిష, సీహెచ్‌వో కరుణాకర్‌, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

బొమ్మలరామారంలో..

బొమ్మలరామారం, జనవరి 8 : కరోనా వ్యాక్సిన్‌ నివారణ టీకా డ్రై రన్‌ను మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో శుక్రవారం నిర్వహించగా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ నివారణ టీకాను ముందస్తుగా వేసుకునే వారి వివరాలను అడిగి తెలుసుకొని డ్రైరన్‌పై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలోడాక్టర్‌ క్రాంతికుమార్‌, తహసీల్దార్‌ పద్మసుందరి, ఆర్‌ఐలు విజయసింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, సీనియర్‌ సహాయకుడు సునీల్‌, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు తదితరులు ఉన్నారు.

భువనగిరి అర్బన్‌లో..

భువనగిరి అర్బన్‌, జనవరి 8 : కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ కార్యక్రమాన్ని పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ పరిశీలించి మాట్లాడుతూ.. డ్రై టీకా వేసుకునే సిబ్బందికి అవగాహన కల్పించడంతోపాటు ప్రోత్సహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ రవిప్రకాశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

బీబీనగర్‌, జనవరి 8 : కొవిడ్‌ టీకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రారంభించిన కరోనా టీకా డ్రైరన్‌ కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ గీత, ఏఎన్‌ఎంలు వసంత, కవిత, సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలేరు రూరల్‌లో.. 

ఆలేరు రూరల్‌, జనవరి 8 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను విజయవంతం చేయాలని ట్రైనీ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ అన్నారు. మండలంలోని శారాజీపేట పీహెచ్‌సీలో నిర్వహించిన డ్రైరన్‌ను ఆమె పరిశీలించి మాట్లాడారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ నిబంధనల ప్రకారం డ్రైరన్‌ను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో శారాజీపేట పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రవణ్‌, వైద్య సిబ్బంది పెద్దలక్ష్మి, రత్నాబాయి, సునీత, యాకయ్య, పాపయ్య తదితరులు ఉన్నారు.

సంస్థాన్‌ నారాయణపురంలో..

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 8 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ వచ్చిన తర్వత ఎలా వేయ్యాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత మంది సిబ్బంది అవసరం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను మండల డిప్యూ టీ డీఎంహెచ్‌వో మనోహర్‌, తాహసీల్దార్‌ బ్రహ్మయ్య పర్యవేక్షించారు. కార్యక్రమంలో వైద్యాధికారి దీప్తి, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లిలో..

భూదాన్‌పోచంపల్లి, జనవరి 8 : పోచంపల్లి పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో మనోహర్‌, హెచ్‌ఈ వసంత, సీహెచ్‌వో చంద్రశేఖర్‌ పర్యవేక్షించి వ్యాక్సిన్‌ డ్రైరన్‌పై వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి యాదగిరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

భువనగిరిలో..

భువనగిరి, జనవరి 8 : మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కరోనా డ్రై రన్‌ను జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడుతలో 8 మంది ఆరోగ్య కార్యకర్తలకు డ్రైరన్‌ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులు కిరణ్‌కుమార్‌, శోభ, సిబ్బంది రజియాబేగం, రాజేశ్వరి, సురేశ్‌, వెంకట్‌ నర్సింహారెడ్డి, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వైద్య సిబ్బందికి అవగాహన..

రామన్నపేట, జనవరి 8 : మండలకేంద్రంలోని ఏరియా దవాఖానతో పాటు మునిపంపుల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, సిబ్బందికి డ్రైరన్‌ నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్‌ ఎండీ ఇబ్రహీం, ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, రవికుమార్‌, వైద్యసిబ్బంది సత్యనారాయణ, వాణిశ్రీ, మంజుల, కవిత పాల్గొన్నారు.

రాజాపేటలో..

రాజాపేట, జనవరి 8 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కరోనా వాక్సిన్‌పై శుక్రవారం డ్రైరన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి, ఏఎన్‌ఎంలకు, ఆశవర్కలకు కరోనా టీకా వేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. డ్రైరన్‌ కార్యక్రమాన్ని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, మండల ప్రత్యేకాధికారి మంక్తానాయక్‌ పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శివవర్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతం

మోత్కూరు, జనవరి 8 : కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైందని జిల్లా వైద్యాధికారి బి.సాంబశివరావు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మోత్కూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను శుక్రవారం నిర్వహించారు. వ్యాక్సిన్‌ కోసం నమో దు చేసుకున్న ఏడుగురికి వ్యాక్సిన్‌ డ్రైరన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి బి.సాంబశివరావు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహించామన్నారు. జిల్లాలో మొదటి విడుతలో 4563 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ టి.రామయ్య, వైద్యాధికారులు కిశోర్‌కుమార్‌, చైతన్యకుమార్‌ పాల్గొన్నారు.

కొవిడ్‌ టీకా పంపిణీకి  పకడ్బందీ చర్యలు చేపట్టాలి

తుర్కపల్లి, జనవరి 8 : త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్‌ టీకా పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నిర్వహించిన కరోనా టీకా డ్రై రన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రై రన్‌కు సంబంధించిన పలు వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి షకీలాభాను, ఎంపీడీవో ఉమాదేవి, వైద్యాధికారి చంద్రారెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo