ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 09, 2021 , 00:34:43

అభివృద్ధి వైపు అడుగులు

అభివృద్ధి వైపు అడుగులు

  • పచ్చదనంతోపాటు పరిశుభ్రతకు మారుపేరు టీ.రేపాక  
  • రూ.74లక్షలతో చెక్‌డ్యాం, రూ.20 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం

ఆత్మకూరు(ఎం) : పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా  మండలంలోని టీ.రేపాక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది. గత పాలకులు గ్రామాభివృద్ధిని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రైతులను ఆదుకునేందుకు గ్రామంలోని బిక్కేరువాగులో రూ.74 లక్షలతో చెక్‌డ్యాం నిర్మా ణం చేశారు. రూ.20 లక్షలతో సీసీరోడ్ల నిర్మా ణం చేపట్టడంతో పాటు గ్రామస్తుల అవసరాల కోసం వైకుంఠధామం, కంపోస్ట్‌ షెడ్‌ నిర్మాణాన్ని చేపట్టారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని ప్రధానవీధుల వెంట 4వేల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి 2వేల మొక్కలు నాటడంతో నేడు అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. 

మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం..

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో అధిక నిధులు మంజూరు  చేయించుకొని గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తాం. ఇప్పటికే గ్రామస్తుల అవసరాల కోసం కంపోస్ట్‌షెడ్‌ నిర్మాణ పనులు పూర్తిచేయడంతో పాటు వైకుంఠధామం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గ్రామ పరిశుభ్రత కోసం రోజూ పారిశుధ్య పనులు చేపడుతున్నాం. ప్రజలందరికీ పచ్చదనంతోపాటు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఏర్పాటు చేశాం. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.

-ప్రమీల, సర్పంచ్‌, టీ.రేపాక

సాగు నీటి సమస్య తీరింది..

గ్రామంలో అధికశాతం వ్యవసాయం పై ఆధారపడి జీవనం కొనసాగించేవారు అధికంగా ఉన్నారు.  గతంలో సాగు నీటి సౌకర్యం లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి కృషితో రూ.74 లక్షలతో గ్రామంలోని బిక్కేరువాగులో చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టడంతో నేడు సాగునీటి సమస్య తీరింది. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడటంతో చెక్‌డ్యాం పూర్తిగా నిండి ప్రవహించింది. నేడు వంద ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉంది.  శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారమైంది.

-యాస అంజిరెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, టీ.రేపాక


VIDEOS

logo