బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 07, 2021 , 00:29:53

మిషన్‌భగీరథ పథకం భేష్‌

మిషన్‌భగీరథ పథకం భేష్‌

జల్‌జీవన్‌ మిషన్‌ జాతీయ బృందం సభ్యులు

నీటి నమూనాలు సేకరణ, సరఫరాపై ఆరా

సంస్థాన్‌నారాయణపురం, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం అమలు అభినందనీయమని జల్‌జీవన్‌ మిషన్‌ జాతీయ బృందం సభ్యులు ఎస్‌.పరమేశ్వరన్‌, విద్యాసాగర్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్‌భగీరథ పథకం అమలు తీరును బుధవారం మండలంలోని గుడిమల్కాపురం, మహ్మదాబాద్‌ గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా జల్‌జీవన్‌ మిషన్‌ బృందం సభ్యులు ఇంటింటికీ తిరిగి గ్రామస్తులు, మహిళలను తాగు నీటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నల్లాల్లో సరఫరా అవుతున్న నీటిని తాగి చాలా బాగున్నాయన్నారు. అంతకుముందు నీటి నమూనాలను సేకరించారు.అనంతరం హరితహారంలో భాగంగా గుడిమల్కాపురంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందివ్వడం అభినందనీయమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకాన్ని దేశంలో అన్ని రాష్ట్రల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లెపల్లి సునీతరెడ్డి, మన్నె పుష్పాలత, చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌ ప్రకాష్‌, ఎస్‌ఈ కృష్ణయ్య, ఈఈ లక్ష్మణ్‌, ధనుంజయరెడ్డి, ఏఈఈ అనూష, గ్రామస్తులు పాల్గొన్నారు.


VIDEOS

logo