శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 07, 2021 , 00:26:33

ఇండస్ట్రియల్‌ పార్కులో... గ్రీన్‌ చాలెంజ్‌

ఇండస్ట్రియల్‌ పార్కులో... గ్రీన్‌ చాలెంజ్‌

దండుమల్కాపురానికి నేడు  ఎంపీ సంతోష్‌కుమార్‌, నటుడు అజయ్‌దేవగణ్‌ 

ఏర్పాట్లను పరిశీలించిన టీఎస్‌ఐఐసీ  చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ 

చౌటుప్పల్‌ రూరల్‌, జనవరి 6 : చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కును రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ సందర్శించనున్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా గురువారం పార్కు ఆవరణలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవగణ్‌తో కలిసి ఆయన మొక్కలు నాటనున్నారు. ఇందుకోసం పార్కులో ఏర్పాట్లను టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు బుధవారం పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, పారిశ్రామిక వేత్తల సమాఖ్య(టీఫ్‌) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.


VIDEOS

logo