బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 06, 2021 , 00:54:33

అన్నదాతల సంక్షేమానికి కృషి

అన్నదాతల సంక్షేమానికి కృషి

  • రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌
  • పెట్టుబడి సాయం అందని రైతు ఉండొద్దు
  • ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

రాజాపేట జనవరి 5: అన్నదాతల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం రాజాపేటలో  రూ. 1.50 కోట్ల నాబార్డు నిధుల నుంచి  మార్కెట్‌ గిడ్డంగి పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతులను రాజును చేయాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారన్నారు. అన్నదాతల సంక్షేమానికి ఆనేక పథకాలను ప్రవేశ పెట్టిన రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. ఆలేరు నియోజక వర్గంలో ప్రతి గుంటకు సాగు నీరందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.  కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గ్యాదపాక నాగరాజు, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, మాజీ జడ్పీటీసీ జెల్ల భిక్షపతిగౌడ్‌,  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, సీసీ బ్యాంక్‌ చైర్మన్లు చింతలపూరి భాస్కర్‌రెడ్డి, మొగులగాని మల్లేశ్‌గౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌ గుంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపడుచులకు వరంలాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శివగణేశ్‌కుమార్‌,  సర్పంచ్‌లు దేవిరాములునాయక్‌, మాడోతు రాణి పాల్గొన్నారు.

VIDEOS

logo