శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Jan 06, 2021 , 00:44:02

రాము గౌడ్ లేని లోటు పూడ్చలేనిది

రాము గౌడ్ లేని లోటు పూడ్చలేనిది

  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి 

భువనగిరి, జనవరి5 : టీఆర్‌ఎస్‌ భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు మారగోని రాముగౌడ్‌ లేని లోటు పూడ్చలేనిదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నమాత్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రాముగౌడ్‌ నాల్గో వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన గొప్ప నాయకుడు రాముగౌడ్‌ అని, అలాంటి నాయకుడి అకాల మరణం టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్‌ కొలుపుల అమరేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నల్లమాసు రమేశ్‌గౌడ్‌, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నోముల పరమేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, రైతుబంధు సమితి మం డల కో-ఆర్డినేటర్‌ కంచి మల్లయ్య, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు లక్ష్మీనారాయణగౌడ్‌, చందుపట్ల రాజేశ్వర్‌రావు, చిక్క ప్రభాకర్‌గౌడ్‌, ముల్లె నాగేంద్రబాబు, కస్తూరి పాండు, సర్పంచ్‌లు మల్లికార్జున్‌, ఎల్లంల శాలినిజంగయ్యయాదవ్‌, ఎంపీటీసీలు మట్ట పారిజాతాశంకర్‌బాబుగౌడ్‌, రాంపల్లి కృష్ణ, నాయకులు జిట్ట లక్ష్మారెడ్డి, పడాల వెంకటేశ్వర్లు, కంబాలపల్లి ఆంజనేయులు, పోల ప్రవీణ్‌కుమార్‌గౌడ్‌, తోటకూరి పరమేశ్‌, బాత్క అశోక్‌, జనగాం మహేశ్‌, మట్ట నగేశ్‌గౌడ్‌, నీల భరత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మసీద్‌, షాదీఖానాకు నిధులు కేటాయించాలి 

భూదాన్‌పోచంపల్లి, జనవరి 5 : పోచంపల్లి పట్టణంలోని మదీనా మసీదు శిథిలావస్థకు చేరడంతో దాన్ని పునర్నిర్మా ణానికి నిధులు కేటాయించాలని కోరుతూ పోచంపల్లి పట్టణానికి చెందిన ముస్లింలు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. అందేవిధంగా ముస్లిం మైనారిటీలు వివాహంతోపాటు ఫంక్షన్లు జరుపుకొనేం దుకు షాదీఖానా నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని వారు కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫో రం అధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, మసీద్‌ కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీంఅలీ, ప్రతినిధులు ఎంఏ షరీఫ్‌, అరీఫుల్లా, సయ్యద్‌ అజ్జు, ఎండీ జహంగీర్‌, సలావుద్దిన్‌, నదీం అబ్దుల్‌ రహీమ్‌, ఫర్హత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన భువనగిరి ఏఎంసీ పాలకవర్గ సభ్యులు

భువనగిరి అర్బన్‌, జనవరి 5: భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన చైర్మన్‌గా రమేశ్‌గౌడ్‌ నియమితు లైన సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం  ఆయన భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రమే శ్‌గౌడ్‌ తమ నియామకానికి కృషిచేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాలకవర్గ సభ్యు లతో కలిసి ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అల్వ మోహన్‌రెడ్డి, కమిటీ సభ్యులు రామిడి రాంరెడ్డి, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జనగాం పాండు,  రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo