మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Jan 04, 2021 , 02:10:29

నకిలీ బంగారు ఆభరణాలు విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

నకిలీ బంగారు ఆభరణాలు విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

  • రూ.6.50లక్షల నగదు  
  • 2.25 కేజీల నకిలీ బంగారం స్వాధీనం

భువనగిరి అర్బన్‌, జనవరి 3: నకిలీ బంగారు ఆభరణాలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా ను భువనగిరి పట్టణ పోలీసులు   అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి డీసీపీ యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని రైతుబజార్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్న నక్కల లక్ష్మి, కరుణాకర్‌ దంపతుల ఇంటికి నవంబర్‌ చివరి వారంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తాము పాత ఇండ్లను కూల్చివేస్తున్న సమయంలో తమకు ఇంటిలో బంగారు ఆభరణాలు దొరికాయని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పా రని, తమకు ముందుగా రెండు గ్రాముల బంగారు ఆభరణాలు ఇవ్వగా వాటిని బంగారు షాపులో తనిఖీ చేయగా అసలైన బంగారమని ఆ షాపు వారు చెప్పారని ఆ దంపతులు తెలిపారు. మళ్లీ డిసెంబర్‌ 12న గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మా ఇంటికి వచ్చి 40తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పడంతో రూ.5.50 లక్షలు ఇవ్వగా వారు 40 తులాల నకిలీ బంగారు ఆభరణాలు ఇచ్చారని లక్ష్మి, కరుణాకర్‌ డిసెంబర్‌ 17న పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు డీసీపీ చెప్పారు. 

ముఠా అరెస్టు..

బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు నకిలీ బంగారు ఆభరణాలు ఇస్తూ మోసం చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణ పరిధిలోని తుక్కాపురం చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఏపీలోని గుంటూరు జిల్లా సత్తనపల్లి మండలంలోని గోగులపాడు గ్రామానికి చెందిన ఉప్పతల్ల నాగరాజు, గుంజి పుల్లారావు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం, అసంపేట గ్రామానికి చెందిన లక్ష్మిలుగా తెలిసింది. ఈ ముగ్గురు ఓ ముఠాగా ఏర్పడి నకిలీ బంగారం వ్యాపారం చేస్తూ అమాయకులను మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తు న్నారని ఇన్‌చార్జి డీసీపీ తెలిపారు. పట్టణంలోని లక్ష్మి కరుణాకర్‌ దంపతులకు నకిలీ బంగారు ఆభరణాలు ఇచ్చామని చెప్పడంతో వారిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6.50లక్షలు నగదు, 2.25 కేజీల నకిలీ బంగారం, రెండు బైకు లు, 3 సెల్‌ ఫోన్లు, స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన తెలిపా రు. నిందితులపై తమిళనాడు, కర్ణాటక, నల్లగొండ, చిట్యాల పీఎస్‌ల పరిధిలోనూ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ భుజంగరావు, పట్టణ సీఐ సుధాకర్‌, ఎస్సై వెంకటయ్య, సిబ్బంది సురేశ్‌, రాజు, ఆంజనేయులు ఉన్నారు. 


VIDEOS

logo