గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 02, 2021 , 00:17:35

యాదాద్రి ఉప స్థపతి మోతీలాల్‌కు ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ అవార్డు

యాదాద్రి ఉప స్థపతి మోతీలాల్‌కు ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ అవార్డు

ఆలేరు, జనవరి 1: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఉపస్థపతిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ జె. మోతీలాల్‌ ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ 2021 అ వార్డుకు ఎంపికయ్యా రు. శిల్పం, దేవాలయ నిర్మాణంలో నైపుణ్యం, కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఉత్తరప్రదేశ్‌ వరల్డ్‌ రికార్డు సిబ్బంది ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం అవార్డు సర్టిఫికెట్‌ను మోతీలాల్‌కు అందజేసినట్లు చెప్పా రు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని నేరుట్లతండాకు చెందిన మోతీలాల్‌కు అవార్డు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

VIDEOS

logo