గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 02, 2021 , 00:17:33

గవర్నర్‌ దంపతులకు స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం

గవర్నర్‌ దంపతులకు స్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం

ఆలేరు, జనవరి1: నూతన సంవత్సరం పురస్కరించుకొని గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ దంపతులకు అర్చకులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లిన యాదాద్రి ఆలయ అర్చక బృందం గవర్నర్‌ దంపతులకు పూలదండ, శాలువా అందజేసి, వేద మంత్రాలు పఠిస్తూ స్వామివారి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదం, యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన  2021 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఇచ్చారు.

VIDEOS

logo