నో ఇయర్ వేడుకలు

- అతిక్రమిస్తే కఠిన చర్యలు, కేసులు నమోదు
- న్యూ ఇయర్ వేడుకలకు అనుమతుల్లేవ్
- రాజధాని సరిహద్దు నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేక నిఘా
- 31న రాత్రి యథావిధిగా డ్రంక్ అండ్డ్రైవ్
- భువనగిరి డీసీపీనారాయణరెడ్డివెల్లడి
న్యూ ఇయర్ గ్రాండ్‌గా ప్లాన్ చేసుకుంటున్నారా? డీజేలు పెట్టుకొని ధూంధాం చేద్దామనుకుంటున్నారా? కాలనీలు, ప్రధాన రోడ్లు... ఇలా ఎక్కడ పడితే అక్కడ కేకులు కట్ చేస్తూ సంబురాలు చేసుకుందామనుకుంటున్నారా? ఏదైనా రిసార్ట్‌లో భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఆ ఆలోచనను విరమించుకొండి...ఈ సారి న్యూ ఇయర్ వేడుకలను పోలీసులు నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే తాటతీస్తామంటున్నారు. ధమ్ మారో ధమ్ అంటూ తెల్లవారే దాక ఎంజాయ్ చేద్దామనుకునే వారికి చెక్ పడింది. అర్ధరాత్రి హ్యపీ న్యూ ఇయర్ అంటు సంబురాలు చేసుకోవడం, వాహనాలపై రయ్‌మని దూసుకుపోతామంటే పోలీసులు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. - భువనగిరి క్రైం
భువనగిరి క్రైం : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఈవెంట్ల పేరుతో ధూంధాం చేద్దామనుకుంటే ఖాకీల ప్రతాపానికి గురికాక తప్ప దు. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కొందరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. నూతన సంవత్సర వేడుకలను రద్దు చేశారు. రిసార్టులు, హోటళ్లు, కాటేజేస్, అపార్ట్మెంట్లు, కాలనీలు, ప్రధాన రోడ్లతో సహా అన్ని చోట్ల ఈ వేడుకలను పూర్తిగా నిషేధించారు. ప్రతీచోట ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు చెబుతున్నారు. డిసెంబర్ 31న తప్పనిసరిగ్గా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. న్యూఇయర్ పేరుతో ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే తమకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రత్యేక నిఘా..
హైదరాబాద్‌లోని అన్ని పబ్బులు, రిసార్టులు ఇలా అన్ని చోట్ల సంపూర్ణంగా నిషేధం విధించడంతో హైదరాబాద్‌కు సరిహద్దులో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాపైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా లో ఉన్న రిసార్టులు, కాటేజీలు ఇలా పలు చోట్ల ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలోని అన్ని మం డలాల్లో పోలీస్ నిఘా కొనసాగుతుందని, కచ్చితంగా ప్రతీచోట డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తగా..
యూకే నుంచి తెలంగాణకు వచ్చిన కొందరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నూతన ఏడాది వేడుకలపై నిషేధం విధించారు. పాజిటివ్ వచ్చిన వారిని గుర్తించి ఇప్పటికే వారి నుంచి శాంపిళ్లను సేకరించారు. కరోనాను ఆదిలోనే అరికట్టే ఉద్దేశంతో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు సహకరించాలి
కరోనా సెకండ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలి. నూతన సంవత్సర వేడుకలను తమ తమ ఇండ్లల్లోనే జరుపుకోవాలి. ఊరేగింపులు, ర్యాలీలు, గుం పులు గుంపులుగా గుమిగూడడం,వాహనాలపై తిరగడం లాంటి పనులకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కరోనా కట్టడికి ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలి.
డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్
తాజావార్తలు
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు