అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

భువనగిరి కలెక్టరేట్ : వివిధ శాఖల అధికారులు ప్రజల నుం చి అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ కీమ్యానాయక్తో కలిసి ఫోన్ ఇన్ ద్వారా, నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ వచ్చే సోమవారంలోగా ఇప్పుడు అందిన అర్జీలను పరిష్కరించి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పోచంపల్లి అర్బన్‌కాలనీ, బ్యాంక్కాలనీతోపాటు పీవీటీ మార్కెట్ పరిధిలో తాగునీరు సరఫరా చేయాలని అర్జీదారులు కోరారు. భువనగిరిలో ఉర్సు ఉత్స వం ఉన్నందున కరోనా నివారణ చర్యల్లో భా గంగా శానిటైజేషన్, తాగునీరు ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రం అందించారు. దానికి సంబంధించిన తగు చర్యలను తక్షణమే తీసుకో వాలని మున్సిపల్ కమిషనర్‌ను అదనపు కలెక్టర్లు ఆదేశించారు. రాజాపేటలో గృహసముదాయాల్లో దుర్గంధం వెదజల్లుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మటన్ షాప్‌ను తొలగించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. బస్వాపురం, సింగన్నగూ డెం, అనాజీపురం గ్రామాల్లో భూసేకరణలో భా గంగా ఇండ్లు, భూమి కోల్పోయినందున త్వరితగతిన పరిహారం చెల్లించాలని పలువురు అర్జీదారులు కోరారు. ఈ కార్యక్రమంలో 72 అర్జీలను నేరుగా, 17 అర్జీలను ఫోన్ ద్వారా స్వీకరించినట్లు అదనపు కలెక్టర్లు తెలిపారు.
పాఠశాలలను తెరవాలి
భువనగిరి కలెక్టరేట్ : ప్రభుత్వం వెంటనే పాఠశాలలను తెరిచి, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక, ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్, పాఠశాల యాజమాన్య కమి టీ జిల్లా ఫోరం, తల్లుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా బడులు మూసేయడం తో పిల్లలు నష్టపోతున్నారని, ఆన్లైన్ తరగతులు అందరికీ చేరడం లేదన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని పాఠశాలలను సత్వరమే తెరవాలని కోరారు. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో ఆఫ్‌లైన్ తర గతులు నడిచే కాలానికి ట్యూషన్ ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలని జారీ చేయాలని కోరారు. బాలికలందరికీ బాలి క ఆరోగ్య రక్షణ కిట్లు అందించాలన్నారు. దివ్యాంగ బాలలకు ఉద్దేశించిన భవిత కేంద్రాలను సత్వరమే తెరవాలని కోరారు. వీటితో పాటు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆయా అసోసియేషన్లకు చెందిన ఎర్ర శివరాజు, కొడారి వెంకటేశ్, సురపంగ శివలింగం, ఆవుల వినోద్‌కుమార్, నీరటి పురుషోత్తం, వనందాసు పాపయ్య, జంపాల అంజయ్య, కాచరాజు జయప్రకాశ్, శిరీష, మమత తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- అతివేగం, మద్యంమత్తుకు మరో ప్రాణం బలి
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం