ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Dec 28, 2020 , 01:18:02

దళిత కౌన్సిలర్‌పై కేసును ఉపసంహరించుకోవాలి

దళిత కౌన్సిలర్‌పై కేసును ఉపసంహరించుకోవాలి

ఆలేరు టౌన్‌ : ఆలేరు మున్సిపల్‌ పరిధిలోని కౌన్సిలర్‌ కందుల శ్రీకాంత్‌పై అకారణంగా పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కందుల శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం సబబు కాదని శ్రీకాంత్‌ అన్నందుకు బీజేపీ పట్టణ నాయకుడు పులిపలుపుల మహేశ్‌ తనపై భౌతికదాడులకు పాల్పడ్డారని శ్రీకాంత్‌పై కేసు నమోదు చేయించడం అప్రజాస్వామికమన్నారు. దళిత ప్రజాప్రతినిధుల ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసును ఉపసంహరించుకోకుంటే ఎమ్మార్పీఎస్‌ సంఘాల తరఫున పెద్దఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. సమావేశంలో కౌన్సిలర్‌ కందుల శ్రీకాంత్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జి గ్యార నరేశ్‌, నాయకులు తాటికాయల నరేందర్‌, క్యాసగళ్ల రమేశ్‌, గూడెం మధు, కందుల వినయ్‌, సంగి నీలయ్య, కందుల వేణు, నగిళ్ల రాజు, కందుల ఆకాశ్‌, కోనపురం రాజు, కొమ్ము పరశురాములు, రాకేశ్‌, ప్రవీణ్‌, కందుల శ్రీను పాల్గొన్నారు.

VIDEOS

logo