శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 27, 2020 , 00:09:53

సీఎంఆర్‌ఎఫ్‌ను వినియోగించుకోవాలి

సీఎంఆర్‌ఎఫ్‌ను వినియోగించుకోవాలి

బీబీనగర్‌: నిరుపేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పెద్దపలుగుతండాకు చెందిన బానోతు శంకర్‌నాయక్‌ ఇటీవల అనారోగ్యం బారిన పడి ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొంది కోలుకున్నాడు. దీంతో సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకోగా రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును శనివారం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి భువనగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుకు అందజేశారు. ఎల్‌ఓసీకి సహకరించిన ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగల్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ బొక్కజైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులుకు శంకర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బానోతు బుచ్చాలు, ఎంపీటీసీ వాణీవీరునాక్‌ తదితరులు పాల్గొన్నారు.

నారాయణగిరిలో శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని ..

భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని నారాయణగిరిలో శ్మశానవాటికకు స్థలం కేటాయించడంతోపాటు వైకుంఠధామం ఏర్పాటుకు నిధులు కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి నారాయణగిరివాసులు విన్నవించారు. గతంలో పోచంపల్లి గ్రామానికి ఆవాస గ్రామంగా ఉన్న నారాయణగిరి ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉందని, పోచంపల్లికి రావాలంటే కనీసం 4 కిలోమీటర్ల దూరం ఉన్నందున అక్కడే ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండడంతో శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కౌన్సిలర్‌ సామల మల్లారెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్‌ రామసామి చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు. 

VIDEOS

logo