మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Dec 25, 2020 , 01:35:04

ఆపదలో అందని వైద్యం

ఆపదలో అందని వైద్యం

  • ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆదేశంతో చికిత్స 
  • జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసిన జిల్లా కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌

గుండాల : హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి గురువారం గుండాలలోని తమ బంధువుల పెళ్లికి వస్తుండగా గుండాల-మోత్కూర్‌ మార్గమధ్యలో బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం దగ్గరలోని గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా దవాఖానలో డాక్టర్‌ శ్రీనివాస్‌తో పాటు ఇతర వైద్య సిబ్బంది ఎవ్వరూ అందుబాటులో లేరు. గాయాలతో బాధపడుతున్న మహిళను చూసి అందుబాటులో ఉన్న అటెండర్‌ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. అదే సమయంలో తన బంధువుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సీపీఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు అక్కడకు చేరుకుని విషయాన్ని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి ఫోన్‌లో తెలిపారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్‌ జిల్లా పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌కు ఫోన్‌ చేసి గాయపడిన మహిళకు తక్షణమే వైద్యం అందేలా చూడాలని సూచించారు. వెంటనే ఖలీల్‌ అక్కడకు చేరుకుని గాయాలైన మహిళకు ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు దవాఖానకు పంపించారు. అనంతరం ఖలీల్‌ ఈ విషయంపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. 

VIDEOS

logo