గురువారం 04 మార్చి 2021
Yadadri - Dec 24, 2020 , 00:06:34

వైభవంగా తిరుప్పావై పూజలు

వైభవంగా తిరుప్పావై పూజలు

శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం

ఆలేరు : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలను పఠిస్తూ తిరుప్పావై పూజలు అత్యంత వైభవంగా చేపట్టారు. అర్చకులు గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో ఎనిమిదవ పాశురాలను పఠించారు. ఓం నమో:నారాయణాయా అనే అష్టాక్షరి మహామంత్రానికి సంబంధించిన పాశురాలను పఠించినట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఈ పాశురంలో మూడు రకాల అర్థాలు, మూడు రకాల దేవులను గోదాదేవి అమ్మవారు ప్రార్థించారన్నారు. ధనుర్మాసంలో భక్తులు ఆలయాలను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు.

శాస్ర్తోక్తంగా స్వామివారి నిత్యకల్యాణం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణం అర్చకులు శాస్ర్తోక్తంగా జరిపారు. వేకువజామునే స్వామివారిని బాలాలయంలో కవచమూర్తులకు ఆరాధనలు జరిపి, పంచామృతాలతో అభిషేకించి, తులసి అర్చనలు జరిపారు. అనంతరం లక్ష్మీనరసింహులను అలంకరించి శ్రీ సుదర్శన హోమం జరిపారు. లక్ష్మీనరసింహుల కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తరంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. కొండపైన ఉన్న రామలింగేశ్వరబాలాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయంగా జరిగాయి. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీసత్యనారాయణ స్వామివారి వత్ర పూజల్లో భక్తులు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. 

శ్రీవారి ఖజానాకు రూ.5,33,386 ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.5,33,386 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.65,914, రూ.100 దర్శనాలతో రూ.28,300, ప్రచారశాఖతో రూ.3,300, క్యాలెండర్లతో రూ.12,000, వ్రతాల ద్వారా రూ.30,000, కల్యాణ కట్టతో రూ.8,160, ప్రసాదవిక్రయాలతో రూ.2,68,700, శాశ్వత పూజలతో రూ.6,000, వాహనపూజలతో రూ.3,800, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,360, అన్నదాన విరాళంతో రూ.2,948, ఇతర విభాగాలతో రూ.1,02,904 లతో కలిపి మొత్తం రూ.5,33,386 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

VIDEOS

logo