గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 24, 2020 , 00:06:32

సర్వాంగ సుందరంగా రహదారులు

సర్వాంగ సుందరంగా రహదారులు

ఆలేరు : నియోజకవర్గంలోని రోడ్లన్నీ సర్వాంగ సుందరంగా మారబోతున్నాయని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కొద్ది నెలల కిందట కురిసిన వర్షానికి ధ్వంసమైన రోడ్లకు పునరుద్ధరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో రూ.80 లక్షలతో పునరుద్ధరణ చేయనున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 163వ జాతీయ రహదారిపై గతంలో నిర్మించిన రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేసి పునరుద్ధరణ బాధ్యతలు తీసుకున్నారన్నారు. వంగపల్లిలో ఉన్న రహదారికి రూ.80 లక్షలు, ఆలేరు పట్టణంలో ఉన్న రహదారికి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఆలేరులో జీడికల్‌కు వెళ్లే రోడ్డు వద్ద అండర్‌ పాస్‌, వంగపల్లిలో మోటకొండూర్‌ మండల కేంద్రానికి వెళ్లే దారిలో మరో అండర్‌పాస్‌ బ్రిడ్జీలు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే నిధులు మంజూరు కాగా టెండర్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఆలేరు నియోజకవర్గంలోని రోడ్లను ఆధునీకరించి రవాణాకు ఇబ్బందిలేకుండా చూస్తామన్నారు. నిధుల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

అర్హులందరికీ డబుల్‌ బెడ్‌ రూంలు..

గ్రామాల్లో ఇండ్లులేని నిరుపేదలందరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. వంగపల్లిలోని ప్రధాన రహదారి వద్ద నిర్మించే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్లులేని ప్రతి నిరుపేదకు డబుల్‌ బెడ్‌ రూంలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సీఎం కేసీఆర్‌ నిరుపేదలకు ఇండ్లను నిర్మించాలన్న సదుద్దేశంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎరుకల సుధ, ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ శంకరయ్య, సర్పంచ్‌ కానుగు కవిత, ఎంపీటీసీలు మౌనిక, పోచయ్య, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ అయిలయ్య, ఉప సర్పంచ్‌ స్వామి, మదర్‌డెయిరీ డైరెక్టర్‌ కళ్లెపల్లి శ్రీశైలం, పీఏసీఎస్‌ డైరక్టర్‌ కానుగు దశరథ, నాయకులు మిట్ట వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి కిశోర్‌కుమార్‌ పాల్గొన్నారు.

ప్రజలకు మరింత చేరువలో 108 సేవలు..

తుర్కపల్లి : ప్రజలకు మరింత చేరువలోకి ప్రభుత్వం 108 అంబులెన్స్‌ సేవలను తీసుకువస్తుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్‌ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తుర్కపల్లి మండలంలో గిరిజనతండాలు ఎక్కువగా ఉండి వెనుకబడి ఉండటంతో ప్రభుత్వం మండలానికి 108  వాహనాన్ని మంజూరు చేసిందన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్స్‌తో పాటు టెక్నిషియన్‌ 24గంటలు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలకు ఎలాంటి వైద్యపరమైన అత్యవసర సేవలు అవసరమైతే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లోపు వాహనం దగ్గరకు చేరుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు వైద్యరంగానికి అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్‌, జడ్పీవైస్‌చైర్మన్‌ బీకునాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పడాల శ్రీనివాస్‌, రైతుబంధు మండల కన్వీనర్‌ నర్సింహులు, పీహెచ్‌సీ డాక్టర్‌ చంద్రారెడ్డి, స్థానిక సర్పంచ్‌ పడాల వనితాశ్రీనివాస్‌, ఎంపీటీసీలు వనజ, కరుణాకర్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, సత్యనారాయణ, కో-ఆప్షన్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్‌షరీప్‌, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్‌యాదవ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ మంజుల, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు భాస్కర్‌యాదవ్‌, నాయకులు శట్టయ్య, ప్రభాకర్‌, వెంకటేశ్‌, భాస్కర్‌నాయక్‌ తదితరులు ఉన్నారు.

డయాలసిస్‌ కేంద్రం సందర్శన..

ఆలేరు టౌన్‌ : పట్టణంలోని డయాలసిస్‌ సెంటర్‌ను ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నా రు. అయితే మూత్రపిండాలు చెడిపోయి ఇబ్బందులు పడుతున్న తమకు చికిత్స చేసుకునేందుకు డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసినందుకు రోగులు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేల రూపాయల ఖర్చు చేసి హైదరాబాద్‌తో ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పడంతోపాటు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, ఏఎంసీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ ఉన్నారు.

VIDEOS

logo