బుధవారం 03 మార్చి 2021
Yadadri - Dec 23, 2020 , 00:47:50

‘భువనగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా’

‘భువనగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా’

భువనగిరి అర్బన్‌: భువనగిరి మున్సిపాలిటీని శంషాబాద్‌ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు మంగళవా రం సందర్శించారు. భువనగిరి డంపింగ్‌ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన రిసోర్స్‌ పార్కులో తడి, పొడి చెత్త వేరు చేయు విధా నం, వర్మి కంపోస్టు ప్లాంట్‌, మానవ వ్యర్థాల శుద్ధికరణ కేంద్రాన్ని సందర్శించారు. మున్సిపాలిటీలో తడి , పొడి చెత్త సేకరణ పద్ధతి, చెత్త నుంచి సేంద్రియ ఎరు వు తయారీ విధానంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను తిరిగి పరిశీలించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు మా ట్లాడుతూ భువనగిరి మున్సిపాలిటీని జిల్లా లో ఆదర్శ మున్సిపాలిటీగా మార్చుతానన్నారు. మున్సిపాలిటీ ఆవరణ పచ్చని చెట్లు, పూలతో, ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉందని, డంపింగ్‌ యార్డు పార్కును తలపిస్తున్నదని, తడి, పొడి చెత్త వేరు చేయు విధా నం చాలా బాగుందని శంషాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్‌పర్సన్‌ బండి గోపాల్‌యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌  సాబేర్‌ అలీ అన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్‌ ఆం జనేయులును   అభినందించారు. అనంతరం శంషాబాద్‌ మున్సిపల్‌ పాలక వర్గ సభ్యులను భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

VIDEOS

logo