బుధవారం 03 మార్చి 2021
Yadadri - Dec 23, 2020 , 00:47:48

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

ఆలేరు : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆ లయంలో మంగళవారం నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 4 గంటలకు స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజ లు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా బా లాలయ మండపంలో లక్ష్మీనరసింహుడి నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మొదటగా స్వామివారి శ్రీ సుదర్శన నారసింహహో మం చేపట్టారు. మహా మండపంలో అష్టోత్తరం చేపట్టారు. సాయంత్రంవేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా చేశారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించి, తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం గావించి ఆంజనేయస్వామివారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. సత్యనారాయణ వత్రాలను ఆచరించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.

స్వామివారి ఆదాయం రూ. 8.06 లక్షలు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ.8,06,451 ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధాన బుకింగ్‌తో రూ.83,936, రూ.100 దర్శనాలతో రూ. 26,000, ప్రచారశాఖతో రూ.4,400, క్యాలెండర్లతో రూ.5,800, వ్రతాల ద్వారా రూ.31,500, కల్యాణకట్టతో రూ.11,760, ప్రసాదవిక్రయాలతో రూ.4,60,090, శాశ్వత పూజలతో రూ.3,348, వాహనపూజలతో రూ.6,200, టోల్‌గేట్‌ ద్వారా రూ.1,190, అన్నదాన విరాళంతో రూ.18,328, ఇతర విభాగాలతో రూ.1,53,899 లతో కలిపి మొత్తం రూ.8,06,451 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

యాదాద్రిలో వైభవంగా నిత్య కైంకర్యాలు

25న వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి 

స్వామివారి ఉత్తరద్వార దర్శనం

నిత్యకైంకర్యాలు, దర్శన వేళల్లో మార్పులు

భక్తులు నిర్వహించే ఉత్సవాలు, ఆర్జిత సేవలు తాత్కాలిక నిలిపివేత

కొవిడ్‌-19 నిబంధనలు తప్పనిసరి

మీడియాకు వివరాలు వెల్లడించిన యాదాద్రి ఆలయ ఈవో గీత

ఆలేరు : ఈ నెల 25వ తేదీ వైకుంఠ(ముక్కోటి) ఏకాదశిని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి వైకుంఠ ద్వార (ఉత్తరద్వార) దర్శనం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. కొవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా కేవలం వైధిక పెద్దలు, వేదపారాయణధారులు, అర్చకుల సమక్షంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6.43 గంటల నుంచి 9.30 గంటల వరకు భక్తులకు ఉత్తరద్వారం ద్వారా స్వామివారు దర్శనమిస్తారని తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాలయంతోపాటు అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం నందు తాత్కాలిక విద్యుద్దీపాలంకరణ, మామిడి తోరణాలు, అరటి మట్టలు, పూలతో అలంకరణ చేయనున్నామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

భక్తులచే నిర్వహించే ఉత్సవాలు, 

అర్జిత సేవలు తాత్కాలిక నిలిపివేత..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా నిలివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. తేదీ 25.12. 2020 నుంచి 30.12.2020 వరకు 6 రోజుల పాటు అధ్యయనోత్సవం నిర్వహించబడుతుందని భక్తులతో జరిపించు మొక్కు, శాశ్వత బ్రహ్మోత్సవం, మొక్కు, శాశ్వత కల్యాణోత్సవం, లక్ష తులసీపుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం రద్దు చేయనున్నట్లు తెలిపారు.

 నిత్య కైంకర్యాలు, దర్శన వేళల్లో మార్పులు..

ఈ నెల 25న వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు, స్థానికులకు ఉత్తర ద్వారదర్శనం కల్పించుటలో భాగంగా బాలాలయం మరియు అనుబంధ ఆలయమైన శ్రీ పాత లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం నందు నిత్యకైంకర్య వేళలను ఈ దిగువ ప్రకారం మార్పు చేయనున్నారు. కింద పేర్కొన్న దాని ప్రకారం ముక్కోటి ఏకాదశి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కైంకర్యముల వేళల్లో మార్పు చేసిన విషయం గమనించి మాకు సహకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అధికారులు కోరారు.  


VIDEOS

logo