సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 22, 2020 , 00:04:00

బలహీన వర్గాల అభ్యున్నతికి నోముల కృషి

బలహీన వర్గాల అభ్యున్నతికి నోముల కృషి

చౌటుప్పల్‌: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య యాద వ్‌ ఎంతో కృషి చేశారని గొల్ల, కురుమ జేఏసీ జిల్లా కన్వీనర్‌ గుండబోయిన అయోధ్యయాదవ్‌ అన్నారు. మున్సిపాలిటీ కేంద్రంలోని షాదీఖానాలో యాదవ సంఘం మండలాధ్యక్షుడు గుండబోయిన వెంకటేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో సోమవారం  ఎమ్మెల్యే సంతాప సభ నిర్వహించా రు. ఈ సందర్భంగా అయోధ్యయాదవ్‌ మాట్లాడుతూ నిత్యం పేదలకు అందుబాటులో ఉం టూ వారి సమస్యలను పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు కొత్త పర్వతాలుయాదవ్‌, నాయకులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్‌, నల్ల అంజయ్య, ఎర్రగోని లింగస్వామి, జాల మల్లే శం, ఆవుల మల్లయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo