మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Dec 19, 2020 , 00:11:17

పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్‌

పేదల పాలిట వరం సీఎంఆర్‌ఎఫ్‌

భూదాన్‌పోచంపల్లి : సీఎం సహాయనిధి పథకం పేదల పాలిట వరంగా మారిందని టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు వెంకటేశం శ్రేష్టి అన్నారు. పోచంపల్లి పట్టణానికి చెందిన డబ్బీకార్‌ మౌనిక బాయ్‌కు రూ.45 వేలు, జట్ల దుర్గయ్యకు రూ.15 వేలు, గుండు బాలయ్యకు రూ.14 వేలు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సహకారంతో మంజూ రు కాగా ఆ చెక్కు లను శుక్రవారం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గుణిగంటి మల్లేశం, కౌన్సిలర్‌ దేవరాయ కుమార్‌లతో కలిసి ఆయన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్ర మంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం భువనగిరి నియోజకవర్గ అధ్యక్షుడు చింతకింది కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి సీత శ్రవణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేముల సుమన్‌గౌడ్‌, కౌరంకొండ శ్రీనివాస్‌, బొడిగె బాబు తదితరులు ఉన్నారు.


VIDEOS

logo