మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Dec 19, 2020 , 00:11:17

పోచంపల్లికి మహర్దశ

పోచంపల్లికి మహర్దశ

పట్టణంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌తోపాటు డబుల్‌ రోడ్డు విస్తరణ పనులు 

రూ. 4.5 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో సుందరీకరణకు చర్యలు

ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి చొరవతో మంజూరు

మారనున్న పట్టణ రూపురేఖలు

భూదాన్‌పోచంపల్లి : గ్రామీణ పర్యాటక కేంద్రంగానే కా కుండా పురపాలికగా మారిన పోచంపల్లి గతంలో కన్నా ప్ర స్తుతం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పోచంపల్లి గ్రామ పంచాయతీగా ఉంటే అభివృద్ధికి నోచుకోదనే ఆలోచనతో మున్సిపాలిటీగా మార్చారు. సుమారు 17,079 జనాభాఉన్న ఈ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గతంలో ఈ పట్టణాన్ని దత్తత తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సుమారు 4.5 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులతో పోచంపల్లిని సుందరీకరించే దిశగా ప్రభుత్వం సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌తోపాటు డబుల్‌ రోడ్డు విస్తరణ పనులు చేపట్టింది. ఈ పనులను పోచంపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తి అయితే పోచంపల్లికి ఓ కొత్త శోభ సంతరించుకోనుంది. దీంతో ఇక్కడ వ్యాపారాలు మరింతగా పెరుగుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

  17.5 మీటర్ల వెడల్పుతో డబుల్‌ రోడ్డు

అయ్యప్ప ఆలయం నుంచి గాంధీ విగ్రహం వరకు మొత్తం 1,550 మీటర్ల మేర రోడ్డు పనులు చేపట్టనున్నారు. ఈ రోడ్డును 17.5 మీటర్ల వెడల్పుతో, దీని మధ్యలో 1.5 మీ టర్ల మేర డివైడర్‌ను ఏర్పాటు చేసి అందులో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇక ఈ స్థలంలో అందమైన పూల మొక్కలను ఏర్పాటు చేయనున్నారు. 


 రోడ్డుకు ఇరువైపులా ఉన్న పాత విద్యుత్‌ స్తం భాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి  పెద్ద , పెద్ద విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి బటర్‌ ఫ్లై లైటింగ్‌ ఏర్పాటు చేస్తారు. రెండువైపులా రోడ్డును 8 మీటర్ల చొప్పున మొత్తం 16 మీటర్ల మేర వేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా చివర 0.5 మీటర్ల మట్టి రోడ్డును ఏర్పాటు చేయనున్నారు. 

తగ్గనున్న  ట్రాఫిక్‌ సమస్య ..

గ్రామీణ పర్యాటక కేంద్రంగానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి ఇక్కత్‌ వస్ర్తాల తయారీ కేంద్రంగా విశ్వప్రఖ్యాతి గాంచడంతో ఈ పట్టణానికి నిత్యం అనేక మంది దేశీయ, విదేశీ పర్యాటకులతోపాటు ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో పోచంపల్లి రోడ్డు పూ ర్తిగా రద్దీగా మారడంతోపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినా రోడ్డు ఇరుకుగా ఉండడంతో అనేకసార్లు ఇక్కడ ట్రాఫిక్‌ జాం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. అయితే ఈ రోడ్డు విస్తరణతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, డివైడర్లు ఏర్పాటు చేయడంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్యను నివారించడానికి వీలు కలుగుతుంది. పోచంపల్లిలో రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటుతో ఇక్కడ ప్రధానంగా జరిగే చేనేత వస్త్ర వ్యాపారానికి తోడు ఇతర వ్యాపార సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండు నెలల్లో ..

పోచంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఇప్పటికే డబుల్‌ రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనుల కోసం రూ. 4.5 కోట్లు మంజూరీ చేసింది. పనులు మొదట కాస్త మందకొడిగా సాగినా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల చివరికల్లా పనులు పూర్తి కావచ్చు.

ఏ బాలశంకర్‌, పోచంపల్లి మున్సిపల్‌ కమిషనర్‌

వ్యాపారాలు పెరుగుతాయి

పోచంపల్లి రోజురోజుకూ అభివృ ద్ధి చెందుతున్నది. పోచంపల్లిలో రోడ్డు విస్తరణతోపాటు సెంట్రల్‌ లైటింగ్‌ సిట్టమ్‌ ఏర్పాటు చేస్తే పట్టణానికి మంచి కళ వస్తుంది. రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి తోడు అన్ని రకాలు వ్యాపారాలు పెరుగుతాయి. పట్టణం అభివృద్ధి చెందుతుంది.                          -కర్నాటి నర్సింహ, 

చేనేత వ్యాపారి భూదాన్‌పోచంపల్లి

ఎమ్మెల్యే సహకారంతో  మరిన్ని పనులు

ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి సహకారంతో పోచంపల్లి పట్టణానికి ఇప్పటి వర కు హెచ్‌ఎండీఏ నిధుల నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యా యి. వాటిలో రూ. 4.5 కోట్లతో రోడ్డు విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు చేపడుతున్నాము. ఇంకా వార్డుల్లో పార్కులు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, వినోభా మందిర్‌ నుంచి బీబీనగర్‌ రోడ్డు వరకు బైపాస్‌ రోడ్డు పనులతోపాటు అనేక పనులు చేపట్టనున్నాము. ఎమ్మె ల్యే సహకారంతో పోచంపల్లిని అన్ని రకాలుగా ముం దంజలో నిలుపుతాము.         -బాత్క లింగస్వామి,

 పోచంపల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌

VIDEOS

logo