సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 18, 2020 , 00:12:39

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలి

ఆత్మకూరు(ఎం) : గ్రామాల అభివృద్ధిలో భాగంగా ప్రజలందరి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న వైకుంఠధామాలు, కంపోస్ట్‌ షెడ్లు, రైతువేదికల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి శ్యామ్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమీక్షసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్‌షెడ్‌ నిర్మాణాలకు విడతల వారీగా బిల్లులు చెల్లించాలని కోరారు. సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్‌, ఎంపీడీవో ఆవుల రాములు, పీఆర్‌ఏఈ రవీందర్‌గౌడ్‌, ఏపీవో రమేశ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo