గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 18, 2020 , 00:12:39

గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం ప్రాధాన్యం

గ్రామాల సమగ్రాభివృద్ధికి సీఎం ప్రాధాన్యం

  • చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి 

భూదాన్‌పోచంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలోనే అన్ని గ్రామాల్లో సమగ్ర మౌలికాభివృద్ధి సాధ్యమైందని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి నిధులతో పెద్దగూడెంలో నిర్మించిన బీసీ కమ్యూనిటీహాల్‌ను, జిబ్లక్‌పల్లిలో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను, జడ్పీ నిధుల నుంచి పోచంపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్మించిన సభాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతం లో కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామా ల్లో అన్ని రకాల వసతుల ఏర్పాటు శరవేగంగా జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామంలో శ్మశానవాటిక, చెత్త డంపింగ్‌ కేంద్రాలతోపాటు సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ గ్రామాల  సమగ్రాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నూతన జిల్లాగా యాదాద్రి భువనగిరి ఏర్పాటు అనంతరం భువనగిరి ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్‌ కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. ప్రతి మండలానికి అవసరాన్ని బట్టి జడ్పీ నిధులను కేటాయిస్తున్నామని ఎలిమినేటి సందీప్‌రెడ్డి తెలిపారు. పోచంపల్లి మండలానికి నిధుల కేటాయింపులోప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన నిధు ల నుంచి ఎక్కువగా భవన నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ సర్కారు ముందంజలో ఉందన్నారు. రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ‘ధరణి’పై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోచంపల్లి మండలాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సం దర్భంగా వారిని పలు గ్రామాల్లో ఘనంగా సత్కరించా రు. కార్యక్రమాల్లో జడ్పీ సీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్ప లత మల్లారెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటేశంయాదవ్‌, పోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ లింగస్వామియాదవ్‌, పెద్దగూడెం సర్పంచ్‌  పద్మారెడ్డి, జిబ్లక్‌పల్లి సర్పంచ్‌ చిన్నలచ్చి లింగస్వామి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు మాధవీశ్రీశైలంగౌడ్‌, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు సామ రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌  భూపాల్‌రెడ్డి, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ నోముల మాధవరెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి,  మహిపాల్‌రెడ్డి, శ్రీదేవీశేఖర్‌రెడ్డి, పగిళ్ల రామ్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. 

కమ్యూనిటీ భవనాలను త్వరగా పూర్తి చేయాలి : ఎమ్మెల్సీ

బీబీనగర్‌: ఎమ్మెల్సీ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని భట్టు గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కమ్యూ నిటీ భవనాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమా ణాలను పాటించాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ గెగ్గలపల్లి మాధవీపురుషోత్తంరెడ్డి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్‌, ఉపసర్పంచ్‌ సంజీవరెడ్డి తదితరులున్నారు.

VIDEOS

logo