శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 17, 2020 , 00:13:46

గ్రామాభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

గ్రామాభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దు

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

బీబీనగర్‌: గ్రామాభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం వహించవద్దని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని మక్తానంతారం గ్రామంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. వీలైనంత త్వరలో శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతి వనం నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీవాణి, సర్పంచ్‌ పసులాది లావణ్య, పంచాయతీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo