శనివారం 06 మార్చి 2021
Yadadri - Dec 17, 2020 , 00:13:45

ఎమ్మెల్యే కిశోర్‌ మరింత ఎదగాలి

ఎమ్మెల్యే కిశోర్‌ మరింత ఎదగాలి

  • ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి
  • మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం
  • రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు

మోత్కూరు : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ భవిష్యత్‌లో మరింతగా ఎదిగి ఉన్నత పదవులను అధిరోహించాలని రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఎమ్మెల్యే కిశోర్‌ జన్మదినాన్ని టీఆర్‌ఎస్‌ మండల, మున్సిపాలిటీ  పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించారు. మెగా రక్తదానం శిబిరం నిర్వహించారు. అనంతరం ఆయన కేక్‌కట్‌ చేసి మాట్లాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే కిశోర్‌ నియోజకవర్గాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అనంతరం పట్టణంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో గణపతి పూజ, శివపూజల చేయించారు. రక్తదాన శిబిరంలో 50 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. మాజీ ఎంపీటీసీ జంగ శ్రీను ఆధ్వర్యంలో  అయ్యప్పస్వాములకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ బొల్లెపల్లి వెంకటయ్య, మండలాధ్యక్ష, కార్యదర్శులు పొన్నెబోయిన రమేశ్‌, గజ్జి మల్లేశ్‌, రైతుబంధు మండల కోఆర్డినేటర్లు  తీపిరెడ్డి మేఘారెడ్డి, కొండ సోంమల్లు, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా చైర్మన్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, పి.వెంకన్న, కూరెళ్ల కుమారస్వామి, వనం స్వామి, దబ్బెటి విజయారమేశ్‌, మలిపెద్ది రజిత, కోఆప్షన్‌ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

అడ్డగూడూరులో...

అడ్డగూడూరు:  ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో కేక్‌కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలోని రోగులకు పండ్లు, బ్రేడ్లు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణశాఖ అధ్యక్షుడు నాగులపల్లి దేవగిరి, సర్పంచ్‌ బాలెంల త్రివేణి  తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo