మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Dec 17, 2020 , 00:13:58

సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయం

సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయం

  • ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి

సబ్బండ వర్ణాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని అర్బన్‌కాలనీలోని చర్చిలో బుధవారం ప్రభుత్వం అందజేసిన  క్రిస్మస్‌ కానుకలను క్రైస్తవులకు ఆయన  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్నిమతాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాలను అమలుచేస్తూ పేదలకు ప్రభుత్వం  అండగా ఉంటుందన్నారు. మరోవైపు  బీబీనగర్‌లోని మున్నా చర్చిలో క్రిస్మస్‌ కానుకలను ఆయన పంపిణీ చేశారు.  

- భువనగిరి అర్బన్‌/బీబీనగర్‌

భువనగిరి అర్బన్‌: రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు జరుపుకునే పండుగలకు ప్రభుత్వం ప్రత్యేక కానుకలను అందజేసి ప్రజల పక్షాన నిలుస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని అర్బన్‌కాలనీలోని చర్చిలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన దుస్తులను బుధవారం క్రైస్తవులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని కుల, మతాల ప్రజలు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలను గుర్తించిన ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పండుగలు సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం పథకాలను అందజేస్తుందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను అందజేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఏ వర్గాల పండుగలను గుర్తించలేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పండుగలను గుర్తించి ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. దసరా, రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకునేందుకు ప్రత్యేక కానుకలను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.  

కానుకలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

ప్రభుత్వం అందజేసే కానుకలను ప్రజలు సద్వినియోగం చేసుకుని సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు క్రిస్మస్‌ సందర్భంగా ఆయా చర్చీల్లో ఫాదర్స్‌ కానుకలు అందజేస్తారని, క్రైస్తవులు కానుకలను పొంది పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌, జిల్లా మైనార్టీ శాఖ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, టీఆర్‌ఎస్‌ పట్టణ, మండల అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, కౌన్సిలర్లు చెన్న స్వాతీమహేశ్‌, నస్త్రీన్హ్రమాన్‌ జహంగీర్‌, కడారి ఉమాదేవి, కుంగల ఎల్లమ్మ, తుమ్మల అనురాధ, ఏవి.కిరణ్‌కుమార్‌, పంగరెక్క స్వామి, అందె శంకర్‌, నాయకులు, ఆయా చర్చీల ఫాదర్స్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo