సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 16, 2020 , 00:18:04

నారు, కూలీలు లేకుండానే నాటు

నారు, కూలీలు లేకుండానే నాటు

అడ్డగూడూరు : అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు మరింత మేలు చేసేందుకు సీడ్‌డ్రిల్‌ వ్యవసాయ పరికరంతో నారు లేకుండానే వరి సాగు చేసే విధానాన్ని అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో మంగళవారం పీఏసీఎస్‌ చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు తన వ్యవసాయ భూమిలో చేశారు. సీడ్‌డ్రిల్‌ పరికరంలోనే నేరుగా వరి విత్తనాలను మెట్ట భూమిలో 15 ఎకరాలలో పోశాడు. దీంతో కూలీల సమస్యతో పాటు ఖర్చులు కూడా తగ్గాయని ఆయన తెలిపారు. ఒరాలు కూడ తీసే సమస్య తీరడంతో పాటు నారు పోసి నాటు వేసే బాధ కూడ తప్పడంతో రైతు పొన్నాల వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కూలీల సాయంతో నాటు వేస్తే తనకు రూ.లక్ష వరకు ఖర్చు వచ్చేదని ఇప్పుడు కేవలం రూ.15 వేలు మాత్రమే వచ్చిందన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం కాసానగోడు గ్రామానికి చెందిన పాషా అనే రైతు మూడు పంటలను ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నాడని తెలుసుకొని ఆయన సలహాలు, సూచనలతో తాను సీడ్‌డ్రిల్‌ పరికరంతో వరి సాగు చేస్తున్నట్లు రైతు పొన్నాల వెంకటేశ్వర్లు తెలిపారు.

VIDEOS

logo