శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Dec 15, 2020 , 00:22:50

పశువులకు నట్టల మందు వేయాలి

 పశువులకు నట్టల మందు వేయాలి

ఆలేరు: చరిత్రలో తొలిసారిగా పాడి పశువులకు నట్టల మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. సోమవారం యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు గ్రామంలో జడ్పీటీసీ తోటకూరి అనురాధ పాల్గొని పాడి గేదేలకు నట్టల మందులను వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువుల్లో నట్టలుంటే పాల దిగుబడి తగ్గడంతోపాటు పునరుత్పత్తి ఉండకపోవడం, మరణాలు సంభవించడం వంటివి జరుగకుండా ప్రభుత్వం అందజేసే నట్టల మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి పాడి రైతు సద్వినియోగించుకోవాలన్నారు. మండల పశువైద్యాధికారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు పశువులకు నట్టల మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోటకూరి బీరయ్య, ఎంపీటీసీ కొక్కలకొండ అరుణ, పాల సంఘం చైర్మన్‌ కౌకుంట్ల రాంచంద్రారెడ్డి, కార్యదర్శి మల్లేశం, సహాయ సంచాలకులు డాక్టర్‌ ఆంజయ్య, పశువైద్య సిబ్బంది నాగరాజు, ఇందిరా, పాల సంఘం డైరెక్టర్లు శ్రీనివాస్‌, శివరాజు, రైతులు రాంచంద్రయ్య, సాయిలు, స్వామి పాల్గొన్నారు.

ఆలేరురూరల్‌లో...

ఆలేరురూరల్‌ : పశు సంపదను కాపాడుకోవాలని ఏడీ డాక్టర్‌ అయిలయ్య అన్నారు. సోమవారం మండలంలోని గుండ్లగూడెంలో పశువులకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలు, ఆవులకు సీజనల్‌ వ్యాధులు సోకుతాయని, అందుకే ముందస్తుగా నట్టల నివారణ మందును వేయాలన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం ఈ నట్టల నివారణ మందును ఉచితంగా పంపిణీ చేస్తుంది. కావున పశువుల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్‌ చైతన్య, శారాజీపేట సబ్‌సెంటర్‌ వైద్యాధికారి నవీన్‌రెడ్డి, సర్పంచ్‌ ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ జూకం టి అనురాధ, పశువైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మోటకొండూర్‌లో... 

మోటకొండూర్‌: మండల వ్యాప్తంగా ఉన్న పాడి రైతులు ప్రభుత్వం అందిస్తున్న నట్టల నివారణ మందులను విధిగా వేయించాలని మండల పశువైద్యాధికారి శ్రీకాంత్‌ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పశువుల దవాఖానలో పశువులకు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న నివారణ టీకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ రేగు శ్రీనివాస్‌, పాల సంఘం అధ్యక్షుడు కొల్లూరి మల్లేశ్‌మిత్ర, మండల పశువైద్య సిబ్బంది క్రాంతిరేఖ, మల్లారెడ్డి, మహేందర్‌, గోపాల మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం)లో... 

ఆత్మకూరు(ఎం): పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ప్రభు త్వం ఉచితంగా పంపిణీ చేసిన నట్టల నివారణ మందులను సోమవారం మండల కేంద్రంతోపాటు కఫ్రాయిపల్లి, పల్లెర్ల గ్రామాల్లో ఆవులకు, గేదెలకు వేయడంతో పాటు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి వల్లాల సంతోష్‌కుమార్‌, సిబ్బంది సైదులు, గణేశ్‌తోపాటు గోపాల మిత్రలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo