రిజిస్ట్రేషన్లకు వేళాయె

- వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు లైన్‌క్లియర్
- స్లాట్ బుకింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు
- సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏర్పాట్లు
కొద్దిరోజులుగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ ప్రారంభం కాను న్నది. సోమవారం నుంచి పాతపద్ధతిలోనే భూము ల రిజిస్ట్రేషన్లు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్లాట్ బుకింగ్‌లు ప్రారంభం కాగా, క్రయవిక్రయదారులు ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకుందామా అని ఎదురుచూస్తు న్నారు. జిల్లాలో 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అన్నిచోట్ల రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికారులకు సెలవులు కూడా రద్దు చేసినట్లు కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఏదిఏమైనప్పటికీ వ్యవసాయేతర ఆస్తు ల రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతుండడంతో రియల్ రంగం మళ్లీ పుంజుకుంటుందని వ్యాపారులు, ప్రజ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- భువనగిరి /ఆలేరు
భువనగిరి/ఆలేరు: వ్యవసాయ భూముల విషయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా సమయం వృథా కాకుండా పూర్తి పారదర్శకంగా నూతన రిజిస్ట్రేషన్ విధానం సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అదే పద్ధతిలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇప్పటికే వీటి వివరాలను ధరణి పోర్టల్ ద్వారా పొందుపర్చడంతోపాటు మ్యుటేషన్, పాసుపుస్తకాల జారీ కోసం వివిధ విభాగాలతోనూ అనుసంధానం చేశారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌తో కాకుండా దానిలోని వివరాలతో పాత ‘కార్డు‘ టెక్నాలజీతోనే రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. కేవలం ఒక్క రిజిస్ట్రేషన్లే కాకుండా వెంటనే మ్యుటేషన్ పూర్తి చేసి, ఈ-పాసుపుస్తకం కూడా జారీ చేస్తారు. తర్వాత ప్రభుత్వం ప్రకటించిన విధంగా మెరూన్ కలర్ పాసుపుస్తకాన్ని పోస్ట్ ద్వారా ఇంటికి పంపించనున్నారు.వాస్తవంగా గత నెల 23 నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం భావించి తగిన ఏర్పాట్లతో సిద్ధమైంది. ఇంతలోనే కొందరు ధరణి పోర్టల్ కోసం సేకరిస్తున్న వివరాలపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుకు వెళ్లడంతో ఇది ఆలస్యమవుతూ వచ్చింది. హైకోర్టు వాయిదా అనంతరం పలు సూచనలు చేస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతించింది. వెంటనే ప్రభుత్వం దీనిపై ఏర్పాట్లకు ఆదేశిస్తూ స్లాట్ బుకింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి మొదలైంది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రభుత్వం అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్లను వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లుగా విభజించింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలు జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ హోదాలో తహసీల్దార్‌కు అప్పగించింది. నవంబర్ 2 నుంచి మండలాల వారీగా ఎక్కడికక్కడే రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్లు, ఈ-పాసుపుస్తకాలను జారీ చేస్తున్నారు. వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రం ఇప్పటివరకు ఆగాల్సి వచ్చింది.
ఆరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో...
జిల్లాలోని భువనగిరి, మోత్కూరు, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట మొత్తం ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. గతంలో వీటి పరిధిలో అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేవి. తర్వాత మ్యుటేషన్ల కోసం తహసీల్దార్ కార్యాల యాలు లేదంటే గ్రామ, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజలు దరఖాస్తు చేసుకునేవారు. ఇక నుంచి ఆ పద్ధతి లేకుండా కేవలం వ్యవసాయేతర భూముల, ఆస్తుల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేశారు. అయితే రిజిస్ట్రేషన్లతో పాటే మ్యుటేషన్, ఈ- పాసుపుస్తకం కూడా వెంటనే జారీ చేసి కొనుగోలుదారులకు అందజేయనున్నారు. ఇక నుంచి అన్ని సేవలు ఒకే చోట అందనుండటంతో అదనపు ఏర్పాట్లు చేశారు. అయితే వీటిల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్, తర్వాత ఈ-పట్టాదారు పాసుపుస్తకాల ముద్రణకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మెరూన్ కలర్ పాసుపుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వీటిలో ఆస్తుల వివరాలను పొందుపర్చేందుకు అవసరమైన ప్రింటర్లను, ఇతర సాంకేతికపరమైన పరికరాలను సమకూర్చారు. అదేవిధంగా స్లాట్ బుకింగ్ ప్రకారంగానే రిజిస్ట్రేషన్లు జరుగనున్న నేపథ్యంలో క్రయవిక్రయదారులు కూర్చునేందుకు ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పనపైనా దృష్టి సారించారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కాగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను కూడా ఆన్లైన్ చేయాలని భావించి గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని రకాల ఆస్తుల నమోదు చేపట్టింది. అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో వివరాలు సేకరించి ఆస్తుల ఆన్‌లైన్‌కు ఆదేశించింది. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలే స్వచ్ఛందంగా తమ ఆస్తులను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వ్యవసాయేతర ఖాళీ స్థలాలు మినహా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, ఇండ్లను, నిర్మాణాల ఆన్లైన్ ప్రక్రియ పూర్తైంది. దీంతో పాటు గతంలో వ్యవసాయేత ఆస్తుల వివరాలు, వాటి మార్కెట్ విలువ తెలంగాణ స్టేట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్(టీఎస్ఐజీఆర్ఎస్) పోర్టల్‌లో ఉండేవి. దీని ద్వారానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసే వారు. అయితే ఈ వివరాలన్నింటినీ ప్రస్తుతం అప్డేట్ చేశారు. దీంతో పాటు ప్రజల నుంచి సేకరించిన ఆస్తుల ఆన్లైన్ వివరాలతో రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఆసక్తితో ప్రజలు..
దాదాపు మూడు నెలల అనంతరం రిజిస్ట్రేషన్లు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో ప్రజల్లో ఆతృత కనిపిస్తున్నది. కొంత ఆలస్యమైనా సరే...డబ్బుతో పాటు సమయం వృథా కాకుండా పారదర్శక సేవలు అందుబాటులోకి రానుండటంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా తమ వ్యాపారం మళ్లీ గాడిలో పడుతుందని భావిస్తున్నారు. పారదర్శక సేవలతో ఆస్తి తగాదాలకు చెక్ పడనుండటంతో రియల్ వ్యాపారం కూడా మరింత పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అన్ని రకాల ఆస్తులకు ఇక ముందు పకడ్బందీగా హక్కులు ప్రజల చేతుల్లో ఉండనున్నాయి.
సర్వం సిద్ధంగా ఉన్నాం ..
నటి నుంచి ప్రారంభంకానున్న వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అందుకు అనుగుణంగా ట్రయల్న్స్ సైతం నిర్వహించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధితశాఖల అధికారులకు సెలవులు రద్దుచేశాం. ఎప్పటికప్పుడు విధుల్లో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం.
-కలెక్టర్ అనితారామచంద్రన్
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు ..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసేందుకు చర్యలు చేపట్టాం. అందుకు వీలుగా ప్రభుత్వం సెలవులను సైతం రద్దు చేసింది. ఈ క్రమంలో శని, ఆదివారాలు సైతం కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నాం. రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులను ఎదుర్కొనేందుకు మార్గనిర్ధేశాలను ఆచరిస్తున్నాం. స్లాట్ బుక్ చేసుకున్న వారికి నిర్ధేశించిన తేదీ, సమయానికి రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాం.
- మదన్‌గౌడ్. సబ్‌రిజిస్ట్రార్ భువనగిరి
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు