క్రిస్మస్ గిఫ్ట్ రెడీ

- 16, 17 తేదీల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంపిణీకీ ఏర్పాట్లు పూర్తి
- జిల్లాలో 2 వేల మందికి గిఫ్ట్ ప్యాక్‌లు
- భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం
సర్వమతాలను గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తోంది. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్లుగానే రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భాల్లోనూ నిరుపేద ముస్లిం, క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున దుస్తులను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ అర్హులైన నిరుపేద క్రైస్తవులందరికీ దుస్తులను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు 2వేల గిఫ్ట్ ప్యాక్‌లు రాగా, గోదాములో భద్రపరిచారు. వీటిని మండల కేంద్రాలకు తరలించి ఈ నెల 15, 16, 17 తేదీలలో పంపిణీ చేసేందుకు అధికారయంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా సం క్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దసరా, రం జాన్ పండుగల సందర్భంగా కానుకలను అందిస్తున్నట్లుగానే క్రిస్మస్ పండుగకు సైతం ప్రభుత్వం దుస్తులను అందజేస్తున్నది. ఈ మేరకు భువనగిరి నియోజకవర్గానికి వెయ్యి గిఫ్ట్ ప్యాక్‌లు, ఆలేరు నియోజకవర్గానికి వెయ్యి గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయి. ప్రస్తుతానికి వీటిని జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో భద్రపర్చగా.. మండల కేంద్రాలకు తరలించి నిరుపేద క్రైస్తవులకు పంపిణీ చేయనున్నా రు. 15, 16, 17 తేదీల్లో మూడు రోజులపాటు సజావుగా పంపిణీ చేసేందుకుగానూ కలెక్టర్ అని తారామచంద్రన్ ప్రత్యేక అధికారులను నియమించారు. భువనగిరి నియోజకవర్గానికి ఆర్డీవో భూ పాల్‌రెడ్డిని, ఆలేరు నియోజకవర్గానికి డీఆర్డీవో ఉపేందర్ రెడ్డిని నియమించారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీల ఏర్పాటు
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పరిధిలో క్రిస్మస్ కానుకల పంపిణీ కోసం ప్రతి నియోజకవర్గానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాస్టర్లతోపాటు అధికారులకు స్థానం కల్పించారు. ఈ కమిటీకి నో డల్ అధికారిగా ఆర్డీవోలు, ప్రత్యేకాధికారులుగా తహసీల్దార్లు వ్యవహరిస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో చీర, ప్యాం ట్, షర్ట్‌తోపాటు యువతుల కోసం డ్రెస్ మెటీరియల్‌ను అందజేస్తున్నారు. స్థానిక పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులను పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి పకడ్బందీగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నా రు. అయితే ప్రతి యేటా ప్రభుత్వం తరఫున నిర్వహించే క్రిస్మస్ విందును కొవిడ్ నేపథ్యంలో నిర్వహించడం లేదని అధికారులు చెప్తున్నారు.
పంపిణీకి అన్ని ఏర్పాట్లుయాదాద్రి భువనగిరి జిల్లా
ఎమ్మెల్యేల చేతుల మీదుగా క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లావ్యాప్తం గా ఇప్పటికే అర్హులైన క్రైస్తవుల జాబితాను రూపొందించడం జరిగింది. మొత్తం రెం డు వేల గిఫ్ట్ ప్యాక్‌లను అందిస్తున్నాం. పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకాధికారులను కూడా నియమించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ గిఫ్ట్ ప్యాక్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
-అనితా రామచంద్రన్, కలెక్టర్