భక్తులతో కోలాహలం

- పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం
- శ్రీవారి ఖాజానాకు రూ. 25,44,688 ఆదాయం
ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల సందడి నెలకొన్నది. పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారాయి. రోడ్లన్నీ పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్తిక మాసం చివరి శనివారం కావడంతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల పార్కింగ్లు పూర్తిగా నిండిపోయాయి. రోజు నడిచే ఆటోలు తప్పా ఇతర వాహనాలను కొండపైకి అనుమతించలేదు. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి స్నాన మాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారి దర్శనం కోసం క్యూలెన్లలో బారులు తీరారు.
పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం
లక్ష్మీనరసింహస్వామి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతు నిర్వహించారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
రూ. 25,44,688 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ. 25,44,688 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.3,59,534, రూ. 150 దర్శనాల ద్వారా రూ. 2,06,700, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 74,700, ప్రచారశాఖ ద్వారా రూ. 3,570, క్యాలెండర్ల ద్వారా రూ. 22,000, వ్రతాల ద్వారా రూ. 6,44,500, కల్యాణకట్ట ద్వారా రూ. 38,640, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 7,71,050, శాశ్వతపూజల ద్వారా రూ. 22,116, వాహనపూజల ద్వారా రూ. 14,200, టోల్గేట్ ద్వారా రూ. 1,930, అన్నదాన విరాళం ద్వారా రూ. 31,900, ఇతర విభాగాలు రూ. 3,53,758 కలిపి రూ. 25,44,688 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు.
తాజావార్తలు
- నెట్‌ఫ్లిక్స్ డీల్ కు నో..కారణం చెప్పిన నాగార్జున
- గల్వాన్‌లో మనపై దాడిచేసిన చైనా కమాండర్‌కు అత్యున్నత పదవి
- మోదీ స్టేడియంలో కోహ్లీసేన ప్రాక్టీస్: వీడియో
- ఆ టీ ధర ఎంతో తెలిస్తే షాకవుతారు తెలుసా..!
- జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
- విద్యార్థులను అభినందించిన మంత్రి ఎర్రబెల్లి
- ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్‌లోకి ఎస్బీఐ?.. అందుకే..!
- ‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటమే మా ప్రాధాన్యత’
- న్యాయవాద దంపతుల హత్యకు వాడిన కత్తులు లభ్యం
- తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాం : అసదుద్దీన్ ఒవైసీ